ధురంధర్ 2 చూడలేదు... అమీర్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన హిట్ ఫ్రాంచైజీ మూవీ ధురంధర్ 2. భారతీయ సినీ ప్రేక్షకులకు కనివినీ ఎరుగని అనుభూతిని అందించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రణ్‌వీర్ జోరు చూస్తుంటే త్వరలోనే 2000 కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ధురంధర్ 2ను వీక్షించిన సామాన్యులు, సినీ ప్రముఖులు ఈ సినిమాపైనా.. హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్యధర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీతో పాటు స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తదితరులు ధురంధర్ 2ను చూసి తమదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.
టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ధురంధర్ 2 సక్సెస్‌పై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే సొంత ఇండస్ట్రీ బాలీవుడ్ నుంచి మాత్రం ధురంధర్ 2కు ఎలాంటి ప్రశంసా దక్కలేదు. ఒకరిద్దరు తప్పించి పెద్దగా స్టార్ హీరోలు సైతం స్పందించలేదు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన అమీర్‌ఖాన్‌ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ధురంధర్ 2 గురంచి అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ.. తాను ధురంధర్ 2ను చూడలేదు, సినిమా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ధురంధర్ 2 యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు అమీర్. దాంతో ఈ వ్యాఖ్యలు హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి. విడుదలై వారం రోజులు గడుస్తున్నా ధురంధర్ 2 ఇంకా రిలీజ్ కాకపోవడం ఏంటీ? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Comments
Post a Comment