Prabhas : రాజా సాబ్ సెట్స్ లీక్.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న రాజు గారి ‘కోట’ !


 

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఏడాదికి కుదిరితే రెండు సినిమాలు లేదంటే ఒక సినిమా అన్నట్లుగా జోరు మీదున్నారు డార్లింగ్. ఈ ఏడాది కల్కితో భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. సంక్రాంతిపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా మారుతితో కలిసి ఆయన చేస్తున్న ది రాజా సాబ్ షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు. 

ఇవి కాక సలార్ 2, కల్కి2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. డార్లింగ్ స్పీడు చూస్తుంటే నెక్ట్స్ ఇయర్ ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కల్కి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ది రాజా సాబ్‌పై భారీ అంచనాలున్నాయి. మారుతి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చిత్ర యూనిట్ .. రాజా సాబ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. 

గత కొన్నేళ్లుగా మాస్ మసాలా , యాక్షన్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న ప్రభాస్ ఫ్యామిలీ డ్రామాలు చేసి చాలా కాలం అవుతోంది. దీంతో ఈసారి కుటుంబ ప్రేక్షకుల కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యారు ప్రభాస్. హారర్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ను కొత్తగా చూస్తారని దర్శకుడు మారుతి చెబుతున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమపాను నిర్మిస్తున్నారు. 

కాగా.. రాజా సాబ్ సినిమా కోసం భారీ సెట్స్‌ను వేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఆ సెట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ పెద్ద కోటను తలపించేలా సెట్స్ వున్నాయి. అయితే అవి ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణం జరుగుతోంది. ఇవి హైదరాబాద్‌లోనే ఉన్నాయా లేక మరేదైనా చోట వేశారా అన్నది తెలియరాలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.


Comments