Akhanda 2 Collections: అఖండ 2 ఐదు రోజుల కలెక్షన్స్... బాలకృష్ణ మూవీ బ్రేక్‌ఈవెన్ కావాలంటే?

 


బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ సినిమాను నిర్మించారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. 

ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూర్చగా.. తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అఖండ 2 విడుదలై 6 రోజులు కావొస్తుండగా.. ఇప్పటి వరకు బాలయ్య చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలి? అన్నది చూస్తే.

అఖండ  2కు భారతదేశంలో ప్రీమియర్స్‌తో 8 కోట్ల రూపాయలు, తొలిరోజున 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 15.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.25 కోట్ల రూపాయలు వసూలైంది. ఇప్పటి వరకు ఇండియాలో 70.6 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్.. 83.55 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 

నార్త్ అమెరికాలో మంగళవారం ఒక్కరోజు 68k డాలర్లు (61.46 లక్షల రూపాయలు) వసూలవ్వగా.. 5 రోజుల వరకు ఈ మొత్తం 900K డాలర్లు (8.13 కోట్ల రూపాయలు) క్రాస్ చేసి ఉంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో అఖండ 2 దూకుడుకు దురంధర్ అడ్డుగా నిలుస్తున్నాడు. లేనిపక్షంలో బాలయ్య ఈ పాటికే 1 మిలియన్ మార్క్ టచ్ చేసేవాడని విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ అమెరికాను మినహాయిస్తే మిగిలిన దేశాలలో అఖండ 2కు మరో 3 కోట్ల రూపాయలు వసూలైంది. దీనితో ఒక్క ఓవర్సీస్‌‌లోనే ఇప్పటి వరకు 11.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

ఇప్పటి వరకు అఖండ 2కు తెలుగు రాష్ట్రాలలో 68 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 1.8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.08 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 9.03 కోట్ల రూపాయలు, కేరళలో 15 లక్షల రూపాయలు వసూలైంది. అలాగే ప్రముఖ టికెటింగ్ యాప్‌ బుక్ మై షోలో ఏకంగా 2 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 

తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో 15.84 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10.22 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.64 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.67 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.68 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.90 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.20 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.39 కోట్ల రూపాయలు రాబట్టాడు బాలయ్య. ఈ కలెక్షన్స్‌ను బట్టి అఖండ 2కి 5 రోజుల్లో 57.29 కోట్ల రూపాయల షేర్... 96.80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ (104 కోట్ల రూపాయల షేర్) కావాలంటే మరో 47 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. 

Comments