అఖండ 2 కలెక్షన్స్... రెండో రోజు బాలకృష్ణ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
అఖండకు సీక్వెల్‌గా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం అఖండ 2. నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ సినిమాను నిర్మించారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించారు.
ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బాలయ్యకు లక్కీహ్యాండ్‌గా మారిన థమన్ సంగీత దర్శకత్వం వహించారు. తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 5వ తేదీన రావాల్సిన అఖండ 2 చిత్రం ఆర్ధిక పరమైన ఇబ్బంది కారణంగా వారం గ్యాప్ తర్వాత రిలీజైంది.
అఖండ 2 చిత్రం అన్ని ఖర్చులు కలిపి 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారైంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల, తమిళనాడు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా 116 రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అఖండ 2 చిత్రం లాభాల్లోకి రావాలంటే 120 కోట్ల రూపాయల షేర్, 240 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూకట్టారు. ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్స్‌లో అఖండ 2 సినిమా విడుదలైంది.
ఎప్పుడు వచ్చాం కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు తొలి రోజు 59.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది అఖండ 2. ఇండియాలో ప్రీమియర్స్ కింద 8 కోట్ల రూపాయలు, తొలి రోజున 22.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 3.77 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 30.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.13 కోట్ల రూపాయలు, కేరళలో 3 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు చొప్పున 30.5 కోట్ల రూపాయల నెట్.. 36.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఓవర్సీస్‌లో నందమూరి బాలకృష్ణ సినిమాకు 7.5 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. సాక్‌నిక్ గణాంకాల ప్రకారం తొలి రోజు అఖండ 2 43.8 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా 59.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఇండియాలో నెట్ వసూళ్లపరంగా బాలకృష్ణ కెరీర్‌లో వీర సింహా రెడ్డి 33.6 కోట్ల రూపాయలు టాప్‌లో ఉండగా.. అఖండ 2 (30.53 కోట్ల రూపాయలు) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డాకు మహారాజ్ (25.35 కోట్ల రూపాయలు), అఖండ 21.2 కోట్ల రూపాయలు, భగవంత్ కేసరి 16.6 కోట్ల రూపాయలు నిలిచాయి. అలాగే ఓవర్సీస్ ప్రీమియర్స్ వసూళ్ల పరంగా అఖండ 2 సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. డాకు మహారాజ్ 735K డాలర్లు (6.65 కోట్ల రూపాయలు)తో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. వీరసింహారెడ్డి 708K (6.41 కోట్ల రూపాయలు), భగవంత్ కేసరి (4.58 కోట్ల రూపాయలు), అఖండ 2 (4.09 కోట్ల రూపాయలు) వసూలు చేసింది.
ఈ వసూళ్లతో అఖండ 2 రెండో రోజు ఎంత రాబడుతుంది అన్నదానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం వరకు ఉన్న ట్రెండ్‌ని బట్టి బాలయ్య మూవీ రెండో రోజు వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ కలెక్షన్స్‌తో బాలకృష్ణ కేవలం రెండు రోజుల్లోనే 90 కోట్ల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు. మరి అఖండ తన విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.
.jpg)
Comments
Post a Comment