బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న రణ్‌వీర్ సింగ్... 900 కోట్ల దిశగా దురంధర్
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం దురంధర్. దేశభక్తి, స్పై, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాకు ఆదిత్య ధార్ తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, నవీన్ కౌశిక్, మానవ్ గోహిల్, సౌమ్యా టాండన్‌లు నటించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు.
విశేష్ నవ్లాఖా సినిమాటోగ్రాఫర్‌గా, శివమ్ కుమార్ వీ పానికర్ ఎడిటర్‌గా పనిచేశారు. శాశ్వంత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ ఏడాది డిసెంబర్ 5న దురంధర్ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 280 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
దురంధర్‌కు భారతదేశంలో తొలి రోజున 28 కోట్ల రూపాయలు, 2వ రోజున 32 కోట్ల రూపాయలు, 3వ రోజున 43 కోట్ల రూపాయలు, 4వ రోజున 23.25 కోట్ల రూపాయలు, 5వ రోజున 27 కోట్ల రూపాయలు, 6వ రోజున 27 కోట్ల రూపాయలు, 7వ రోజున 27 కోట్ల రూపాయలు, 8వ రోజున 32.5 కోట్ల రూపాయలు, 9వ రోజున 53 కోట్ల రూపాయలు, 10వ రోజున 58 కోట్ల రూపాయలు, 11వ రోజున 30.5 కోట్ల రూపాయలు, 12వ రోజున 30.5 కోట్ల రూపాయలు, 13వ రోజున 25.5 కోట్ల రూపాయలు, 14వ రోజున 23.25 కోట్ల రూపాయలు, 15వ రోజున 22.5 కోట్ల రూపాయలు, 16వ రోజున 34.25 కోట్ల రూపాయలు, 17వ రోజున 38.5 కోట్ల రూపాయలు చొప్పున 555.75 కోట్ల రూపాయలు, 666.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
దురంధర్ తొలి వారం 207.25 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో తొలి వారం కంటే రెండో వారం రణ్‌వీర్ సింగ్ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ సినిమా బరిలో ఉన్నప్పటికీ దానికి మించి దురంధర్ వసూళ్లు రాబట్టడం విశేషం. భారత్‌లో పూర్తిగా రణ్‌వీర్ సింగ్ డామినేషన్ కనిపిస్తోంది.
భారత్‌తో సమానంగా ఓవర్సీస్‌లో దురంధర్ ఆదిపత్యం కనిపిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 12 మిలియన్లు (107 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మిగిలిన దేశాలలో 80 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో ఓవర్సీస్ నుంచి దురంధర్ సినిమాకు 187 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ఏడాది ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలో రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్‌ల కూలీ (180.50 కోట్ల రూపాయలు) టాప్‌లో నిలిచింది. ఇప్పుడు ఈ వసూళ్లతో ఆ రికార్డ్‌ను దురంధర్ బద్ధలు కొట్టి 200 కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 17 రోజుల వరకు దురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 852.75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

Comments
Post a Comment