రామ్ చరణ్‌తో ఆటాపాటా.. పెద్దిలో ఐటెం సాంగ్‌కి సంయుక్త రెమ్యునరేషన్ ఎంతంటే?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో, పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్‌తో డిజాస్టర్ ఎదుర్కొన్న చరణ్.. ఈసారి మాత్రం సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యెందు, బొమన్ ఇరానీ, విజీ చంద్రశేఖర్, రాజతవ దత్తా, సత్య, జాన్ విజయ్, పోసాని కృష్ణమురళీ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా పెద్ది సినిమాను నిర్మిస్తున్నాయి.
ఏప్రిల్ 30న పెద్ది సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలు, షూటింగ్ పూర్తికాకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. జూన్‌లో పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెద్దిలో ఓ ఐటెం సాంగ్ తప్పించి మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఐటెం సాంగ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. తమన్నా, మృణాల్ ఠాకూర్‌ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఈ ప్రచారాన్ని వారు ఖండించారు.
చివరికి ఈ ఛాన్స్ సంయుక్త మీనన్‌ను వరించినట్లుగా రూమర్స్ వస్తున్నాయి. వరుస విజయాలు, సినిమాలతో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి.. రామ్ చరణ్‌తో కలిసి ఆడిపాడనున్నారు. చెర్రీ మాస్ డ్యాన్స్‌కు, సంయుక్త అందాలు ఈ స్పెషల్ సాంగ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ ఐటెం నెంబర్ కోసం సంయుక్త మీనన్‌కు కళ్లు చెదిరే పారితోషికం ముట్టజెబుతున్నారట మేకర్స్. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు 3 కోట్ల రూపాయలను సంయుక్త ఛార్జ్ చేస్తున్నారట. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండటంతో పాటు వరుస విజయాలతో గోల్డెన్ హ్యాండ్‌గా ముద్ర వేసుకున్న సంయుక్తకు ఈ రేంజ్‌లో ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు. మరి నిజంగానే సంయుక్తకు 3 కోట్ల రూపాయల పారితోషికం నిజమో? కాదో త్వరలోనే తేలనుంది.
.jpg)
Comments
Post a Comment