భూత్ బంగ్లా డే 1 కలెక్షన్స్.. అక్షయ్ మూవీకి ఓపెనింగ్స్ ఎంత రావొచ్చంటే?
అక్షయ్ కుమార్, టబు జంటగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భూత్ బంగ్లా. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు. వామికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు
ఏప్రిల్ 17వ తేదీన ఈ భూత్ బంగ్లా మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భూత్ బంగ్లా మూవీకి 150 కోట్ల రూపాయలతో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 184 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉండగా.. క్లీన్ హిట్ కావాలంటే 280 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని చెబుతున్నారు.
అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్స్ + ఫస్డ్ డేకు గాను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇండియాలో భూత్ బంగ్లాకు దాదాపు 3.32 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1.29 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. 2026లో విడుదలైన బాలీవుడ్ సినిమాలలో అడ్వాన్స్ బుకింగ్ పరంగా భూత్ బంగ్లా 3వ స్థానంలో నిలవగా.. ధురంధర్ 2 (53 కోట్ల రూపాయలు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత బోర్డర్ 2 (12.5 కోట్ల రూపాయలు) రెండో స్థానంలో నిలిచింది.
అక్షయ్ కుమార్ మూవీకి ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్‌తో ఇండియాలో 6.26 కోట్ల రూపాయల నెట్.. 7.46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు ఇండియాలో అక్షయ్ కుమార్ మూవీకి 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 18 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Comments
Post a Comment