Peddi: పెద్ది బడ్జెట్ ఎంత? రామ్ చరణ్ ముందు టార్గెట్ ఎంతంటే?

 


తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. దాంతో ఎలాగైనా అభిమానులకు సాలీడ్ హిట్ అందించాలని డిసైడ్ అయిన రామ్ చరణ్ .. తన వీరాభిమాని బుచ్చిబాబు సానాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉప్పెన తర్వాత కొన్నేళ్ల పాటు చరణ్ కోసం వెయిట్ చేసి చివరికి అనుకున్నది సాధించారు బుచ్చిబాబు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూవీ పెద్ది. 

స్పోర్ట్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు తెరకెక్కించాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ, రవికిషన్, విజి చంద్రశేఖర్, సత్య, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే తదితరులు నటించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.

పెద్దిని 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. రామ్ చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

నైజాంలో 48 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 24 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 18 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 10.20 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 8.25 కోట్ల రూపాయలు, గుంటూరులో 11.20 కోట్ల రూపాయలు, కృష్ణాలో 9.30 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.30 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.25 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 34 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్‌గా 218 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పెద్ది. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 220 కోట్ల రూపాయల షేర్.. 450 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. 

సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ గడ్డు పరిస్ధితులని ఎదుర్కొంటోంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కీలకమైన సమ్మర్ సీజన్ నిరుత్సాహ పరిచింది. దాంతో ప్రేక్షకులు రాక... కొత్త సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోయాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఆశలన్నీ పెద్దిపైనా ఉన్నాయి. మరి టాలీవుడ్‌కు పెద్ది సినిమా తిరిగి ఊపిరి పోస్తుందో లేదో చూడాలి. 


Comments