ఐడియాను దాచుకోవద్దు.. అమ్మేయండి.. పాతికేళ్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ప్రస్తుతం జెన్ జీ జనరేషన్ ఆకాశామే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినా జీవితంలో సక్సెస్ కొడుతున్నారు. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీని వాడుతున్న ఈ తరం వారు.. ఏ సెక్టార్ అయినా సరే తమదైన బెంచ్ మార్క్‌లు సెట్ చేస్తున్నారు. నిండా పాతికేళ్లు కూడా దాటకుండానే కోటీశ్వరులుగా మారిపోతున్న వారు ఉన్నారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని సూత్రానికి తమ తెలివితేటలు జోడించి జెండా ఎగురవేస్తున్నారు. తాజాగా ఓ పాతికేళ్ల కుర్రాడు తన తెలివితేటలతో వ్యాపారవేత్తగా అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం.
అతను ఎవరో కాదు.. జెడిటల్ మీడియా వ్యవస్థాపకుడు జైద్ ఖాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఖాన్.. తొలుత డాక్టర్ కావాలని కలలు కన్నారు. ఒకవేళ నీట్‌లో క్వాలిఫై కాకపోతే ఇంజనీరింగ్ సెకండ్ ఛాయిస్‌గా పెట్టుకున్నారు. అయితే డెస్టినీ ఆయనను మరో మార్గం వైపు నడిపించింది. యూట్యూబ్ ఛానెల్స్‌కు పనిచేయడం ప్రారంభించి, కాలిఫోర్నియాకు చెందిన ఓ ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌తో పాటు కొన్ని ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లను దక్కించుకున్నాడు. పర్సనల్ బ్రాండింగ్, మీమ్ మార్కెటింగ్, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ నిర్వహణ సేవలను జెడిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అందిస్తున్నారు.
ఇటీవల ది క్రోర్ క్లబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యాపార ప్రయాణం, ఆర్ధిక విజయాలు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జైద్ ఖాన్. మీ దగ్గర ఉన్నది నైపుణ్యం, సలహా.. ఏం ఉన్నా సరే ముందు అమ్మడం మొదలుపెట్టాలి. అది 100 డాలర్లయినా, 200 డాలర్లయినా సరే.. ఇది మీలోని ఆత్మ విశ్వాసాన్ని మరో స్థాయికి చేరుస్తుంది. ఆన్‌లైన్‌లో యాక్టీవ్‌గా ఉండటం, మీకంటూ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవాలని ఖాన్ తెలిపారు.
2023లో నా 22వ యేట తొలిసారిగా కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించానని అప్పటి నుంచి తన వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నానని.. విద్యాపరంగా మరింత పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఐఐఎం బెంగళూరులో చదువుకుంటున్నట్లు చెప్పాడు. నేను జీవితంలో వెనుకబడిపోయింది చదువు విషయంలోనే.. అందుకే కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని వ్యాపారంలో అమలు చేస్తున్నా. మనం ఏం సాధించాలనుకున్నా దానికి డబ్బు ఇంధనం వంటిదని ఖాన్ చెప్పారు.
ఈ ప్రయాణంలో నా తల్లిదండ్రులు నాపై నమ్మకం ఉంచారు. నీట్‌కు 10 రోజుల ముందు నన్ను జర్నలిజంలో చేర్చించారు. కానన్ 80డీ కెమెరాతో వీడియోలు తీసి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే స్థాయికి ఎదిగినట్లు ఖాన్ వెల్లడించారు. కంటెంట్ అనేది డిజిటల్ కరెన్సీ.. ఆన్‌లైన్‌లో యాక్టీవ్‌గా లేనప్పుడు మీరు ఎవ్వరికీ కనిపించరు, ఎవ్వరికీ తెలియదని ఖాన్ అభిప్రాయపడ్డారు.

Comments
Post a Comment