సాయిపల్లవి క్రేజ్.. రామాయణకు లేడీ పవర్‌స్టార్‌కు రికార్డ్ రెమ్యునరేషన్?
గ్లామర్ షో, ఇంటిమేట్ సీన్స్‌కు దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటవచ్చని నిరూపించారు లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి. ఇష్టమొచ్చిన కథలను ఎంచుకోకుండా తనకు మనసుకు నచ్చిన, కథాబలమున్న పాత్రలనే చేస్తూ అరుదైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సాయిపల్లవి. అందం, డ్యాన్స్, నటన ఇలా ఏ విషయంలోనైనా తనకు తిరుగులేని నిరూపించుకున్నారు ఈ ముద్దుగుమ్మ.
దక్షిణాదిలో ఎదురులేదని ప్రూవ్ చేసుకున్న సాయిపల్లవి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో జెండా ఎగరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ దిన్‌తో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయిపల్లవి అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయారు. అయితే రణబీర్ కపూర్ హీరోగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి అకాశం దక్కించుకున్నారు. ఇందులో సీతగా ఆమె నటిస్తున్నారు.
దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా నవంబర్ 6న రామాయణ తొలి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం సాయి పల్లవి రెండేళ్లకు పైగా సమయం వెచ్చించారు. అయితే సీతగా సాయి పల్లవిని తీసుకోవడంపై హిందీ జనాలు, సినీ ప్రముఖులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు లేడీ పవర్‌స్టార్.
అయితే రామాయణ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రామాయణ రెండు భాగాలకు కలిపి సాయి పల్లవికి 20 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక దక్షిణాదికి చెందిన హీరోయిన్‌కు బాలీవుడ్‌లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందించడం సాధారణ విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ దెబ్బతో భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె, ఆలియా భట్, నయనతార, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్ల సరసన సాయి పల్లవి స్థానం సంపాదించుకున్నారు.
.jpg)
Comments
Post a Comment