థియేటర్‌లలోకి ఆదర్శ కుటుంబం.. వెంకటేష్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత అక్టోబర్ 9న విడదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కూడా వాయిదాపడి చివరికి అక్టోబర్ 30వ తేదీన ఆదర్శ కుటుంబం విడుదల అవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
వెంకటేష్ గతంలో నటించిన క్లాసిక్ చిత్రాలు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కథ, సంభాషణలు అందించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వెంకటేశ్‌తో త్రివిక్రమ్ కలిసి పనిచేస్తున్నారు. అంతేకాదు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. దాంతో ఆదర్శ కుటుంబంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నారా రోహిత్, రావు రమేశ్, నివేదా పెతురాజ్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఆదర్శ కుటుంబం చిత్రం అక్టోబర్ 30న రిలీజ్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.
.jpg)
Comments
Post a Comment