సమంతతో క్లోజ్‌గా రాజ్ నిడిమోరు.. దర్శకుడి భార్య సంచలన పోస్ట్

 


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. రోజురోజుకు వీరిద్దరి మధ్య బంధానికి సంబంధించి ఏదో ఒక వార్త బయటికి వస్తూనే ఉంది. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను జంటగా దర్శించుకోవడం, శుభం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఫ్లైట్‌లో రాజ్ భుజాలపై సమంత వాలిపోవడం, నిన్నగాక మొన్న రాజ్‌తో సామ్ పికెల్ బాల్ ఆడుతున్న ఫోటోలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీరు బాంబు పేలుస్తారని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఒకదానికొకటి లింక్ పెడుతూ జరుగుతున్న పరిణామాలతో రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కాలమే అన్నింటినీ బయటపెడుతుందని, కర్మ దీనికి సమాధానం చెబుతుందని, ఆ విశ్వమే నిశితంగా పరిశీలిస్తుందని శ్యామాలి పోస్ట్ పెట్టారు. సమంత- రాజ్ నిడిమోరు ఎఫైర్ వార్తల మధ్య ఆమె సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత హిందీలో ది ఫ్యామిలీమెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లు చేశారు. వీటిని రాజ్ & డీకేలు తెరకెక్కించారు. వీరిలో రాజ్ నిడిమోరు ఒకరు. ఈయన తెలుగువారు కావడం విశేషం. చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుకున్నారు. బీటెక్ తర్వాత అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. తర్వాత మిత్రుడు డీకేతో కలిసి సినీరంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కించారు. 

ఫ్యామిలీమెన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌ల షూటింగ్ సమయంలోనే సమంతకు, రాజ్ నిడిమోరుకు పరిచయం ఏర్పడి ఇది ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. తమ బంధంపై జరుగుతున్న ప్రచారంపై సమంత, రాజ్ నిడిమోరులు విడివిడిగా ఖండించినా ఈ గాసిప్స్‌కు చెక్ పడటం లేదు. తాజాగా శ్యామాలి పోస్ట్‌తో ఈ వ్యవహరం ఎటు దారి తీస్తుందో చూడాలి. 


Comments