ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? పవన్ మూవీకి ఎన్ని కోట్లు రావాలంటే?

 


ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తోన్న ధురంధర్ 2 మూవీ రిలీజ్ కూడా ఇదే రోజు ఉండటంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. 

ఓజీ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో పాటు గబ్బర్ సింగ్ (2012) విడుదలైన 14 ఏళ్ల తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుగా ఉస్తాద్‌ను మార్చి 26న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ యష్ నటించిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదాపడటంతో ఉస్తాద్ ఒక వారం ముందుకు జరిగి మార్చి 19న విడుదల అవుతోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, యలమంచిలి రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు పార్ధిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, రాజీవ్ కనకాల, పోసాని కృష్ణమురళి, గౌతమి, చమ్మక్ చంద్ర, రావు రమేశ్‌లు ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయనాంక బోస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేశారు. 

ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా... లాస్ట్ మినిట్‌లో నెట్‌ఫ్లిక్స్ చేతికి ఇవి చిక్కాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నైజాం థియేట్రికల్ రైట్స్ 46 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ 13 కోట్ల రూపాయలు, కృష్ణా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలు, నెల్లూరు థియేట్రికల్ రైట్స్ 4.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 9.50 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 7.50 కోట్ల రూపాయలు, గుంటూరు థియేట్రికల్ రైట్స్ 9.50 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా 7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయలు కింద వరల్డ్ వైడ్‌గా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కళ్యాణ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 133 కోట్ల రూపాయల షేర్.. 270 కోట్ల రూపాయల  గ్రాస్ కలెక్షన్స్  తీసుకురావాలని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.  


Comments