హీరోగా అనిల్ రావిపూడి.. నిర్మాతగా దిల్‌రాజు
టాలీవుడ్‌లో ఓటమి ఏరుగని దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. తొలి సినిమా పటాస్ నుంచి ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు వరకు అనిల్ తీసిన ప్రతి చిత్రం విజయాన్ని సాధిస్తూ వచ్చింది. ప్రతియేటా ఖచ్చితంగా తన సినిమాను విడుదల చేస్తూ.. సంక్రాంతి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి.
ఆయనలో డైరెక్టర్‌తో పాటు మంచి నటుడు కూడా ఉన్నారు. హీరో కావాలని అనిల్ కూడా కలలు కన్నారు. అయితే తన సినిమాల్లో గెస్ట్ రోల్స్ మాదిరిగా తళుక్కున మెరుస్తూ ముచ్చట తీర్చుకుంటున్నారు. పలు ఈవెంట్స్‌లో విక్టరీ వెంకటేష్, డాక్టర్ రాజశేఖర్ వంటి స్టార్స్‌ను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీస్తారు అనిల్ రావిపూడి. ఒడ్డూపొడుగూ, ఫిజిక్, అందంతో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనిపించుకున్నారు ఈ దర్శకుడు. తాజాగా అనిల్ రావిపూడిని నటుడిగా పరిచయం చేస్తానిన చెప్పారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు.
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్, యంగ్ హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, దిల్‌రాజులు సందడి చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాు మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిలో మంచి నటుడు ఉన్నారు. ఆయనను నటుడిగా నేనే పరిచయం చేస్తాను. ఎప్పుడు నన్ను కలిసినా? స్టోరీ డిస్కషన్స్ కోసం వచ్చినా అదే మాట చెబుతానని దిల్‌రాజు తెలిపారు.
ఆ వెంటనే అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. రాజుగారి ఆఫర్ బాగుంది, అయితే ఆయన ప్రొడ్యూసర్‌గా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా, నేను దర్శకుడిగా సినిమాను తీస్తా. ప్రస్తుతానికి నటుడిగా మారాలన్న ఆలోచన లేదని తేల్చేశారు. కాగా.. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత విక్టరీ వెంకటేష్ - నందమూరి కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా ఒక మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments
Post a Comment