అనిల్ రావిపూడికి కోలీవుడ్ నుంచి బంపరాఫర్? ఆ స్టార్ హీరో 50వ సినిమాకి డైరెక్టర్‌గా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నారు. చేసిన ప్రతి సినిమా కావడంతో పరాజయం లేని దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు అనిల్. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లతో కలిసి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
చాలా తక్కువ బడ్జెట్‌తో, అత్యంత వేగంగా సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్ట్ అని ముద్ర వేయించుకున్న అనిల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు బడా నిర్మాతలు, హీరోలు క్యూకడుతున్నారు. తాజాగా వెంకటేష్ - కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఆయన తదుపరి సినిమాపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.
పటాస్ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అనిల్. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారితో సినిమాలతో వరుస హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి రావడం హిట్‌ని ఖాతాలో వేసుకుని వెళ్లడం అనిల్‌కి ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ని అందించాడు అనిల్.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్- నందమూరి కళ్యాణ్‌రామ్‌లతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ - వెంకీ కలయికలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. అలాగే పటాస్ అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత నందమూరి కళ్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి సినిమా చేస్తుండటం విశేషం. షైన్ పిక్చర్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియో సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్ సరన కృతిశెట్టి హీరోయిన్లుగా నటించనున్నారని ఫిలింనగర్ టాక్.
కాగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు పలువురు కోలీవుడ్ స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కూడా అనిల్ డైరెక్షన్‌లో చేయాలని అనుకున్నారు. అయితే ఆ కాంబో సెట్ కాలేదు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో కోలీవుడ్ అగ్రనటుడు సూర్య పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పతో కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు సూర్య. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య నటిస్తున్నారు.
ఆ తర్వాత తన 47వ సినిమాను జీతూ మాధవన్ తెరకెక్కిస్తుండగా.. పా రంజిత్, టీజే జ్ఞానవేల్‌లతో సినిమాలు చేసేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో సూర్య కెరీర్‌లోనే మైలురాయిగా చెబుతున్న 50వ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఆ దర్శకుడు అనిల్ రావిపూడేనంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్ అయితే ఖచ్చితంగా హిట్ గ్యారెంటీ అని సూర్య విశ్వసిస్తున్నారు. అలాగే అనిల్ చెప్పిన కథ కూడా ఆయనకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనిల్ - సూర్య కాంబోపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
.jpg)
Comments
Post a Comment