Peddi Public Talk: పెద్ది పబ్లిక్ టాక్.. రామ్ చరణ్ మూవీపై జనం టాక్ ఇదే
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లపై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ, వెంకట సతీష్ కిలారులు కలిసి పెద్ది సినిమాను నిర్మించారు.
జూన్ 4న పెద్ది మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే జూన్ 3వ తేదీ రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. పెద్దిపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు డైరెక్షన్ ఎలా ఉంది? అనే దానిపై సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్‌కు రంగస్థలంకు నేషనల్ అవార్డ్ రాలేదు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకు నేషనల్ అవార్డ్ రాకపోతే నేషనల్ అవార్డ్ జ్యూరీనే మార్చుకోవాలేమో. అందరూ ఓ టైప్ ఆఫ్ మూవీస్‌కి అలవాటు పడిపోయారు. స్లో యాక్షన్, స్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పిచ్చి పిచ్చి బీజీఎంలు, గాలిలో ఎగిరే సీన్లు వస్తే అదే సినిమా అనుకుంటున్నారు. కానీ నిజంగా ఒక యాక్టర్ పొటెన్షియల్ ఏంటీ? కమర్షియల్ యాంగిల్ అన్ని పక్కనపెడితే పెద్దితో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము.
మన తెలుగులో ఇలాంటి మూవీ వచ్చింది. ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ మూవీలా అనిపించింది. ఇంటర్వెల్ వచ్చినప్పటి నుంచి తెరపై వాళ్లు ఏడుస్తుంటే మాకు ఏడుపొచ్చింది. వాళ్లని కొడుతుంటే ఆ పెయిన్ మనకి వస్తుంది. థియేటర్‌లో చూసిన 600 మందిలో ఒక్కళ్లనైనా పెద్ది సినిమా ఖచ్చితంగా ఇన్‌స్పైర్ చేస్తుందని ఒక అభిమాని తెలిపారు.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్‌స్పైర్ అవ్వాల్సిందే. ఐడెంటీటీ, గెలుపు అనేది చాలా ముఖ్యం. అది ఉంటేనే బయట రెస్పెక్ట్ ఇచ్చేది కూడా అని ఓ ప్రేక్షకుడు చెప్పాడు. రామ్ చరణ్ బాడీ చూస్తే అదిరిపోయింది. నాకు కూడా జిమ్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుంది.. ఎందుకు రాదో చూద్దామని ఓ అభిమాని అన్నాడు.
మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. బుచ్చిబాబు గారి డైరెక్షన్ కానీ, రామ్ చరణ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది ఒక సినిమా కాదు.. ఒక ఆటగాడి గెలుపు. ఆట అనేది స్వార్ధం కోసం కాదు.. ఒక పర్పస్ కోసమని సూపర్‌గా ప్రజెంట్ చేశారు. చరణ్ జీవితంలో మరో మైలురాయి. తండ్రిని మించిన తనయుడిగా ఇవాళ ఆయన యాక్టింగ్ అద్భుతంగా చేశాడు అని ఫ్యాన్స్ తెలిపారు.
.jpg)
Comments
Post a Comment