300 కోట్లకు అడుగు దూరంలో మెగాస్టార్.. మన శంకర వరప్రసాద్ గారుతో చిరంజీవి రికార్డ్‌లు చూశారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులు అసలు సిసలు సంక్రాంతిని తెచ్చింది. మెగాస్టార్ నుంచి తాము ఏళ్లుగా మిస్ అయిన.. తాము చిరంజీవిని ఎలా చూడాలని అనుకుంటున్నామో నాటి వింటేజ్ హీరోని అభిమానుల ముందు ప్రెజెంట్ చేశారు అనిల్ రావిపూడి. చిరంజీవికి తోడు వెంకటేష్ అల్లరితో మన శంకర వరప్రసాద్ మూవీ భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. విడుదలై వారం దాటిపోయిన నేపథ్యంలో చిరంజీవి ఫస్ట్ వీక్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేశారు అనేది ఆసక్తిగా మారింది.
సాక్‌నిక్ వెబ్‌సైట్ వెల్లడించిన లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు మూవీ భారతదేశంలో తొలివారం 158 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్... 188 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ చెప్పింది. మెగాస్టార్ మూవీ ఇప్పటికే నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్లు రాబట్టగా.. త్వరలోనే 3 మిలియన్ డాలర్లు (27 కోట్ల రూపాయలు) మైలురాయిని చేరుకోనుంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ వీక్‌లో 292 కోట్లు వసూలు చేసినట్లు షైన్ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. సోమవారం నాటి కలెక్షన్స్‌తో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో తొలి 300 కోట్ల రూపాయల సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిలవనుంది.
టాలీవుడ్‌కు నాలుగు దశాబ్ధాలుగా నాలుగు స్తంభాల్లా నిలిచిన నలుగురు అగ్ర కథానాయకుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత 300 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోగా చిరంజీవి నిలవనున్నారు. అలాగే వరుసగా రెండు సంక్రాంతులకు రెండు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచారు. అలాగే మొదటి వారంలో 292 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి రీజనల్ మూవీగా మన శంకర వరప్రసాద్ నిలిచింది. దానితో పాటు విడుదలైన ఏడో రోజు 30 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా శంకర వరప్రసాద్ కొత్త చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు.. ప్రాంతీయ చిత్రాల విభాగంలో అత్యంత వేగంగా బుక్ మై షోలో 3 మిలియన్లకు పైగా టికెట్స్ బుక్ చేసిన సినిమాగా నిలిచింది. కృష్ణా జిల్లాలో తొలి వారం అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 5 చిత్రాలలో మన శంకర వరప్రసాద్ గారు (7.63 కోట్ల రూపాయలు) 4వ స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ (10.70 కోట్ల రూపాయలు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పుష్ప 2 (8.49 కోట్ల రూపాయలు), బాహుబలి 2 (8.35 కోట్ల రూపాయలు), కల్కి 2898 ఏడీ (7.02 కోట్ల రూపాయలు)తో నిలిచాయి.

Comments
Post a Comment