మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్... చిరంజీవి సినిమాకు ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
ఓటమి ఏరుగని దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్గింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. పటాస్‌తో మొదలుపెట్టి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు అనిల్. తాజాగా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నారు. ఎంతో మంది దర్శకులకు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఒక కల. అలాంటి అరుదైన అవకాశం అనిల్ రావిపూడికి దక్కింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా అనిల్ నెక్ట్స్ ఎవరితో చేస్తున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ మెగా 157గా మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రకటించారు. యాక్షన్, కమర్షియల్ సినిమాలతో బిజీ అయిపోయిన చిరును వింటేజ్ లుక్‌లోకి తీసుకొచ్చారు అనిల్. మెగాస్టార్ మార్క్ డ్యాన్స్‌లు, కామెడీలతో మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార ఆయనకు జంటగా నటించారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా పనిచేశారు. తమ్మిరాజు ఎడిటర్‌గా సేవలు అందించారు. ఇక అన్నింటిలోకి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు అనిల్ రావిపూడి. దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న చిరంజీవి- విక్టరీ వెంకటేష్ కాంబోని ఆయన సుసాధ్యం చేశారు. చిరుతో కలిసి వెంకీ చేసిన అల్లరితో మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరత్ సక్సేనా, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మెగాస్టార్ క్రేజ్, అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డులతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో బాగానే రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు 150 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. దీనికి ముందు రోజు రాత్రి తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లలో పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 800 స్క్రీన్లు, కర్ణాటక + తమిళనాడులలో 300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 800 స్క్రీన్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 2100 థియేటర్స్‌లో మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్ గారు తొలిరోజు కలెక్షన్స్‌పై ఓ లుక్కేస్తే... పెయిడ్ ప్రీమియర్స్ కింద ఏపీ, తెలంగాణలలో 8.5 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు ( 13.52 కోట్ల రూపాయలు) చొప్పున 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. తొలి రోజున ఏపీ, నైజాంలలో 60 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 8 కోట్ల రూపాయలు ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు 85 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
.jpg)
Comments
Post a Comment