వామ్మో .. !! రూ.75,000 మార్క్ దాటిన బంగారం.. కొనాలా, వద్దా..?

 



దేశంలో బంగారం ధర మరోసారి పెరిగి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా శుక్రవారం పుత్తడి రూ.75 వేల మార్కును దాటింది. సాయంత్రం 6.30 గంటల నాటికి భారతీయ బులియన్ మార్కెట్లలో 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర రూ.75,550గా నమోదైంది. కేవలం ఒక్కరోజులనే బంగారం ధర రూ.1000 మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర రూ.2,388 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 

బంగారంతో పాటు వెండి సైతం ఏమాత్రం తగ్గేదే లేదంటూ పరుగులు పెడుతోంది. ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.1400 మేర పెరిగి రూ.86,300కు చేరుకున్నట్లు వర్తకులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమాసియాలోని నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో మదుపరులు సురక్షిత పెట్టుబడిగా బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్ధితులే పుత్తడి ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. 

Also Read : మా కుటుంబంలో చీలిక తెచ్చారు.. అయినా చెక్కుచెదరలేదు : వైఎస్ అవినాష్ రెడ్డి

షేర్‌ఖాన్‌లోని అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సింగ్ ప్రకారం.. యూకే, జర్మనీలు ప్రకటించబోయే స్థూల ఆర్ధిక సంఖ్యలు అలాగే చైనీస్ ట్రెడ్ డేటా బంగారం ధరలను నిర్దేశిస్తుందన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ).. ఊహించిన విధంగా బెంచ్‌మార్క్ రేట్లను యథాతథంగా వుంచింది. అయితే జూన్‌లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని సంకేతాలు ఇచ్చింది. ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న భయాలు జూన్ 6న జరగనున్న తదుపరి పాలసీ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపునకు దారి తీస్తుందని ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ సంకేతాలు ఇచ్చారని సింగ్ తెలిపారు. 

Comments