‘‘Poorvi Leher ’’ పేరుతో ఇండియన్ నేవీ విన్యాసాలు

 



ప్రస్తుతం అంతర్జాతీయంగా సముద్ర రవాణాలో నెలకొని వున్న పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని .. సముద్రంలో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ సంసిద్ధతను తనిఖీ చేసే ప్రయత్నాల్లో భాగంగా తూర్పు తీరం వెంబడి విస్తృతమైన కసరత్తు చేసినట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ‘‘Poorvi Leher ’’ పేరుతో చేసిన ఈ విన్యాసాల్లో నౌకలు, జలాంతర్గములు, విమానాలు, ప్రత్యేక నావికా బలగాలు పాల్గొన్నాయి. 

భారత నావికా దళం తూర్పుతీరంలో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆపరేషనల్ కంట్రోల్ కింద పూర్వి లెహర్ విన్యాసాలను నిర్వహించినట్లు నౌకాదళం తెలిపింది. ఈ ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సంసిద్ధతను అంచనా వేయడానికి , పాలసీలను ధృవీకరించడం లక్ష్యంగా ఈ విన్యాసాలు జరిగినట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది.

వ్యూహాత్మక దశలో వాస్తవిక దృష్టాంతంలో పోరాట శిక్షణ, ఆయుద దశలో కాల్పులను విజయవంతంగా నిర్వహించడంతో పాటు లక్ష్యానికి ఆయుధాలను బట్వాడా చేయగల భారత నావికాదళ సామర్ధ్యాన్ని పునరుద్ఘాటించే దిశగా ఈ విన్యాసాలను పలు దశల్లో నిర్వహించారు. తూర్పు నౌకాదళంతో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ , కోస్ట్‌గార్డ్‌కు చెందిన దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 


Comments