సైబర్ దాడులు.. రష్యాది అగ్రస్థానం, టాప్‌-10లో భారత్


 

కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా.. సైబర్ నేరగాళ్లు సైతం అక్రమార్జన కోసం అందివచ్చిన ఏ మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. వీరిలో కొందరు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్తుండగా.. ఇంకొందరు మాత్రం లోలోపల కుమిలిపోతున్నారు. 

సైబర్ నేరాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్ 10 దేశాల్లో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ‘‘వరల్డ్ సైబర్‌క్రైం ఇండెక్స్ ’’ ఆధారంగా 100 దేశాల్లో జరుగుతోన్న వివిధ సైబర్ నేరాల సమాచారాన్ని విశ్లేషించి దీని ఆధారంగా నివేదికను రూపొందించారు. 

ఈ లిస్ట్‌లో రష్యా అగ్రస్థానంలో నిలవగా.. ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమానియా, నార్త్ కొరియా, బ్రిటన్ , బ్రెజిల్ , భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సాంకేతిక సైబర్ క్రైమ్‌లకు రష్యా, ఉక్రెయిన్‌లు కేంద్రంగా మారినట్లు పేర్కొన్న నివేదిక .. ఈ విషయంలో నైజీరియా మాత్రం వెనుకబడి వున్నట్లుగా పేర్కొంది. 

మనదేశంలో మాత్రం రెండూ రకాల సైబర్ నేరాలు వున్నట్లు తెలిపింది. మాల్వేర్, రాన్సమ్‌వేర్, హాకింగ్ వంటి సాంకేతికత సాయంతో డేటా చోరీ, క్రెడిట్ కార్డులు, అడ్వాన్స్ పేమెంట్స్, వర్చువల్ కరెన్సీ వంటి మోసాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వున్నట్లు నివేదిక తెలిపింది. 


Comments