టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు : ఈ ఏడాది చంద్రబాబుకు రాజయోగం.. 128 స్థానాల్లో కూటమిదే గెలుపు
ఆంధ్రప్రదేశ్‌లో వార్డు / గ్రామ వాలంటీర్ల కొనసాగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పంచాంగ శ్రావణం ఆలకించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేల గౌరవ వేతనం అందజేస్తామని ప్రకటించారు.
వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ముందు నుంచే చెబుతున్నామని.. ప్రజలకు సేవ చేసే వారికి అండగా వుంటామని చంద్రబాబు వెల్లడించారు. ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని.. ఈ ఐదేళ్లలో కారం , చేదు రుచులే వున్నాయని.. అశాంతి, అభద్రతాభావం కనిపిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. బకాసురుడిని మించిన పాలన సాగిందని.. సహజ వనరులన్నీ వైసీపీ దోపిడీ చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
అంతకుముందు పంచాంగ శ్రవణం సందర్భంగా పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఈ ఏడాది అధికార యోగం వుందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ సెగ్మెంట్లలో విజయం సాధిస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడే మళ్లీ అమరావతి నిర్మాణం చేపడతారని మాచిరాజు జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీది వృశ్చిక రాశి అని.. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారని వేణుగోపాల్ అన్నారు.
వాలంటీర్లకు రూ.10 వేల పారితోషికం ఇస్తామని, ఉగాది రోజున హామీ ఇచ్చిన చంద్రబాబు గారు#TDPJSPBJPWinning#AndhraPradesh pic.twitter.com/29QTUGmqBH
— Telugu Desam Party (@JaiTDP) April 9, 2024

Comments
Post a Comment