పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము.. వీటికి దూరంగా వుండండి : కేడర్‌కు జనసేన కీలక సూచనలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలికాలంలో తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. మొన్నామథ్య రెండ్రోజుల పాటు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తీవ్ర జ్వరం కారణంగా పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. తిరిగి పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
అయితే .. పవన్ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. రికరెంట్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని, ప్రతిరోజూ పవన్‌కు జ్వరం వస్తూనే వుందని తెలిపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పర్యటనల సందర్భంగా అభిమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనసేన వివరించింది.
పవన్ ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని క్రేన్ ద్వారా గజమాలలు వేయొద్దని, కరచాలనాలు, ఫోటోల కోసం ఆయనను ఒత్తిడి చేయవద్దని పేర్కొంది. అలాగే పూలు చల్లినప్పుడు పవన్ ముఖంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన పార్టీ సూచించింది. ఈ మేరకు జనసేన నేతలు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
జనసేనాని పర్యటనలోఈ జాగ్రత్తలు పాటించమని మనవి pic.twitter.com/Gxbp2kOLVP
— JanaSena Party (@JanaSenaParty) April 20, 2024

Comments
Post a Comment