గుడిలో దేవుడిని మోడీ బజారులోకి లాగారు : రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు మంచోడే కానీ, కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్లేనని వ్యాఖ్యానించారు. పద్మారావు నామినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ , కేటీఆర్ ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పద్మారావు పరువు తీయడానికే సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా నిలబెట్టారు.. ఈ టికెట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం ఆరోపించారు.
హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చింది ఎవరో చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని కాపాడింది, నగరాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన తెలిపారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని రేవంత్ వ్యాఖ్యానించారు. భగవంతుడిని ప్రధాని నరేంద్ర మోడీ బజారులోకి తీసుకొచ్చారని.. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ నెగ్గాలని చూస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో, కేంద్రంలోనూ గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బండారు దత్తాత్రేయను ఓడించి సికింద్రాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్ మూడు రంగుల జెండా ఎగురవేశారని సీఎం గుర్తుచేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత నాటి రోజులను దానం నాగేందర్ పునరావృతం చేస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాగేందర్ గెలిచి కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదలు, వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైతే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చిల్లిగవ్వ తీసుకురాలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి, టిపిసిసి అద్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. pic.twitter.com/z990Qxmz16
— Telangana Congress (@INCTelangana) April 24, 2024

Comments
Post a Comment