జనసేన స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా...?

 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ , బీజేపీలతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా.. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ బరిలో దిగారు. 

పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై వున్నప్పటికీ కూటమి అభ్యర్ధుల తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, టీడీపీ చీఫ్  చంద్రబాబు నాయుడులతో కలిసి ఆయన పలు బహిరంగసభల్లోనూ పాల్గొంటున్నారు. ఇదిలావుండగా.. ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి పార్టీ స్టార్ క్యాంపెయినర్లను జనసేన ప్రకటించింది. 

జనసేన స్టార్ క్యాంపెయినర్లు :

కొణిదెల నాగబాబు

అంబటి రాయుడు

జానీ మాస్టర్

సాగర్

పృథ్వీ

హైపర్ ఆది

గెటప్ శ్రీను



Comments