గుజరాత్ : రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. పదుల సంఖ్యలో మృతులు, ఇంకా పెరిగే అవకాశం

 


గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. భవనం మొత్తం క్షణాల్లో వ్యాపించాయి. ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది చిన్నారులేనని సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనాస్ధలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భవనంలో పలువురు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

అగ్నిప్రమాదం ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. మరోవైపు ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు రాజ్‌కోట్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన సీఎం భూపేంద్ర పటేల్‌‌తో ఫోన్‌లో మాట్లాడారు. 


Comments