వడదెబ్బ ఎఫెక్ట్ .. ఒకే చెరువులో 2 టన్నుల చేపలు మృత్యువాత
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఆఫీసులు, ఇతరత్రా పనులతో బయటకు వెళ్లేవారు ఎండ దెబ్బకు వణికిపోతున్నారు. 46, 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ వుండటంతో జనం ఠారెత్తిపోతున్నారు.
చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఎండతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత, ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, ఐస్ క్రీంలను ఆశ్రయిస్తున్నారు. రోహిణీ కార్తె రాకముందే పరిస్ధితి ఇలా వుంటే మున్ముందు ఎండలు ఎలా వుంటాయోనని ప్రజలు వణికిపోతున్నారు.
మన పరిస్ధితే ఇలా వుంటే మూగజీవాలు, వన్యప్రాణుల బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో తెలంగాణలోని మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు దాదాపు 2 టన్నుల చేపలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఈ చెరువుపై ఆధారపడి జీవిస్తున్న 200 కుటుంబాలు కన్నీటిపర్యంతమయ్యాయి.
చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత వున్నప్పటికీ, ఎంతో కష్టపడి నీటి వనరును ఏర్పాటు చేసుకున్నామని మత్స్యకార కుటుంబాలు తెలిపాయి. అయినప్పటికీ చేపలు చనిపోవడంతో తమకు భారీగా నష్టం వాటిల్లినట్లు వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వడదెబ్బ.. 2 టన్నుల చేపలు మృత్యువాత
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024
రంగారెడ్డి - మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి.
ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్న కష్టపడి నీటి ఏర్పాటు చేశాం.. అయినా లాభం… pic.twitter.com/YDX0jZGBb8

Comments
Post a Comment