ఎన్టీఆర్ షర్ట్ విప్పితే బొమ్మ బ్లాక్‌బస్టరేనా..?
చిత్ర పరిశ్రమ సెంటిమెంట్ చుట్టూ నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఎవరేం చేసినా.. ఏది ఫాలో అయినా అంతా సక్సెస్ కోసమే కదా. అందుకే ఇందులో ఎవరికి అభ్యంతరాలు ఉండవు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఓ సెంటిమెంట్‌ను అప్లయ్ చేసేందుకు మేకర్స్ భావిస్తున్నారట. వివరాల్లోకి వెళితే.. వార్-2 ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ముంబైలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు.. త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేయనున్నారు.
వార్-2లో అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నారు. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్లు కావడంతో ఇద్దరిపై ఓ సాంగ్ కంపోజ్ చేస్తున్నట్లుగా బీ టౌన్ టాక్. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమివ్వనున్నారట. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అంతేకాదు.. ఎన్టీఆర్ గతంలో షర్ట్ లేకుండా కనిపించిన సినిమాలు సూపర్‌హిట్ కావడంతో వార్-2 కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్‌లో జూనియర్ సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లేకుండా కనిపించగా ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేతలోనూ ఆయన సిక్స్ ప్యాక్ లుక్ చూపించగా.. ఈ మూవీ కూడా బాగా ఆడింది.
చివరిగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్‌లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో రామారావు చొక్కా లేకుండా కనిపించగా.. ఈ సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాల సెంటిమెంట్ నేపథ్యంలో వార్-2 కూడా ఖచ్చితంగా హిట్ సాధిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
వార్-2తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇందులో ఆయన సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ , మురళీ శర్మ, అభిమన్యు సింగ్‌లు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కొసరాజు ‘దేవర’ను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ని ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Comments
Post a Comment