ఓటమి తర్వాత ఈవీఎంలపైనే నిందలేస్తారు : అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఏ ఎన్నిక జరిగినా కొందరు గెలవడం, మరికొందరు ఓడిపోవడం సహజం. అయితే ప్రజా తీర్పుకు కట్టుబడి కొందరు మాత్రం ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు . ఇంకొందరు నేతలు మాత్రం ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతోంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని ఎన్నికల సంఘం ఎన్నిసార్లు, ఎంతగా మొత్తుకున్నా ఆరోపణలకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా ఇండియా కూటమిపై మండిపడ్డారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఓటమికి సిద్ధంగా ఉన్నాయని అమిత్ షా జోస్యం చెప్పారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్ధి లేరని, ఎన్నికల్లో ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఆ పార్టీలు ఈవీఎంలను నిందించేందుకు సిద్ధమయ్యాయని హోంమంత్రి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తోందన్న ఆయన.. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మార్క్‌ను దాటేశామన్నారు.
జూన్ 4 మధ్యాహ్నం ఇద్దరు యువరాజులు (రాహుల్, అఖిలేష్) మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈవీఎంపై నిందలు వేస్తారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ 40, అఖిలేష్ 4 సీట్లను గెలవడం కూడా కష్టమేనని ఆయన పేర్కొన్నారు. మీరు ప్రధానిగా సమర్ధవంతంగా వ్యవహరించగలరా .. పీవోకే ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్న అమిత్ షా, త్వరలోనే దానిని దక్కించుకుంటామన్నారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని కొందరు చెబుతున్నారని.. కానీ బీజేపీకి అలాంటి భయాలేవి లేవన్నారు.

Comments
Post a Comment