మోడీ ప్రభుత్వంతోనే మహిళా సాధికారత : దగ్గుబాటి పురంధేశ్వరి

 




ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌ను జగన్ కోరడం, దీనికి కూటమి ప్రభుత్వం నుంచి కౌంటర్లు రావడంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అన్నింటికి మించి శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారంటూ మరో దుమారం రేగుతోంది. 

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీకి జగన్ హాజరుకావడం తదితర అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ప్రతిఫలం అందించేలా ఉందని పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాలు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పలు అధికరణలు తీసుకొచ్చారని వాటిని భారతీయ జనతా పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుందని ఆమె వెల్లడించారు. 

దేశ జనాభాలో దాదాపు 48 శాతం మంది మహిళలు ఉన్నారని మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళ అభ్యున్నతి కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు. దేశంలోని జన్‌ధన్ ఖాతాలలో 75 శాతం మహిళల ఖాతాలో ఉన్నాయని ఆమె తెలిపారు. భేటీ బచావ్ - భేటీ పడావో కార్యక్రమంతో బ్రూణ హత్యలు చాలా వరకు తగ్గిపోయాయని , స్త్రీ పురుష నిష్పత్తి పెరుగుతోందని ఎంపీ చెప్పారు. 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇళ్లు కట్టించాలన్న లక్ష్యానికి మరో 3 కోట్ల ఇళ్లను అదనంగా కేటాయిస్తామని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని పురంధేశ్వరి గుర్తుచేశారు. ఇదే విషయాన్ని బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రస్తావించారని, ఇప్పటి వరకు కేటాయించిన ఇళ్లలో దాదాపు 74 శాతం ఇళ్లు మహిళల పేరు మీద కేటాయించారని ఆమె వెల్లడించారు. 

స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్ధాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని .. దీని కింద 73,151 స్టార్టప్‌లను మహిళను లీడ్ చేయడమో లేదంటే వాటికి డైరెక్టర్స్‌గా ఉన్నారని పురంధేశ్వరి చెప్పారు. 

ప్రసూతి సమయంలో చాలా మంది మహిళలు సరైన పర్యవేక్షణ లేక మరణిస్తున్నారని.. దీనిని అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పురంధేశ్వరి వెల్లడించారు. చిన్నారులు  ప్రాణాంతకమైన 7 జబ్బుల బారినపడుతున్నారని.. వారిని ఆదుకునేందుకు కావాల్సిన వ్యాక్సిన్‌లు అత్యంత ఖరీదైనవి కావడంతో ఇంద్ర ధనుష్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. 

2016వ సంవత్సరంలో 62 శాతం మంది బిడ్డలకు ఇంద్ర ధనుష్ కార్యక్రమం కింద వ్యాక్సిన్ ఇవ్వడంతో ఇవాళ 76.04 శాతం మంది బిడ్డలకు వ్యాక్సినేషన్‌ను ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మనదేశంలో 91 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయని పురంధేశ్వరి తెలిపారు. 

 


Comments