విజయ్‌‌ వర్మతో బ్రేకప్.. ఘాటుగా తమన్నా ఫస్ట్ రియాక్షన్!

 


ప్రేమ పక్షులు తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్ వార్తలు చిత్ర సీమను కలవరపాటుకు గురిచేశాయి. రేపో మాపో ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందని అంతా భావిస్తున్న వేళ వీరిద్దరూ విడిపోవడం దుమారం రేపింది. ఎంతో హ్యాపీగా గడుపుతున్న ఈ జంట ఎందుకు విడిపోయింది? దీనికి దారి తీసిన కారణాలేంటీ అనేది తెలియక తమన్నా అభిమానులు, సినీ ప్రముఖులు జుట్టు పీక్కుంటున్నారు. కానీ ఏదో బలమైన కారణం వల్లే వీరిద్దరూ విడిపోయి ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. 

2023లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 చిత్రం విజయ్ వర్మ- తమన్నా బంధానికి బాటలు వేసింది. దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో గ్లామరస్ రోల్స్, అందాల ప్రదర్శనకు నో చెప్పకుండా నటించిన తమన్నా.. ఏనాడూ అంతకుమించి హద్దులు దాటలేదు. అలాంటి తన నట జీవితంలోనే తొలిసారిగా లస్ట్ స్టోరీస్ 2లో మాత్రం విజయ్ వర్మతో చెలరేగిపోయింది. లిప్‌లాక్‌తో పాటు ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయింది. 

విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉండటం, త్వరలో పెళ్లి చేసుకోనుండటంతోనే తమన్నా విజృంభించిందని బీటౌన్ మీడియాలో కథనాలు వచ్చాయి. లస్ట్ స్టోరీస్ 2 జనాల్లోకి వెళ్లడానికి కూడా తమన్నా - విజయ్‌ల ఎపిసోడ్ కారణమైంది. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరి గురించే చర్చించుకునేవారు జనాలు. ఆ తర్వాత వీరిద్దరూ పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో మీడియా మసాలా వార్తలను వండి వార్చింది. 

అన్ని వైపుల నుంచి ఎటాక్స్ మొదలుకావడంతో తమన్నా - విజయ్‌లు తమ రిలేషన్ బయటపెట్టక తప్పలేదు. తాను విజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఆయనను తనను బాగా అర్ధం చేసుకున్నారని, నా ప్రపంచంలోకి వచ్చేశారని మిల్కీబ్యూటీ తెలిపారు. నాటి నుంచి సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, ఫ్యాషన్ షోతో పాటు ప్రైవేట్ పార్టీల తదితర కార్యక్రమాలకు తమన్నా - విజయ్ జంటగానే హాజరయ్యేవారు. 

ఇలా అన్ని అనుకూలంగా ఉండటం..  తమన్నా కెరీర్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆమె జీవితంలో సెటిలైపోతారని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ జంట విడిపోయినట్లుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా తమన్నా, విజయ్‌లు విడివిడిగానే ఉండటం... ఎక్కడా కలిసి కనిపించకపోవడంతో నెటిజన్లకు ఎక్కడో తేడా కొట్టింది. ఇక మీడియా వీరికి తోడు కావడంతో తమన్నా - విజయ్ బ్రేకప్ అంటూ హాట్ హాట్ వార్తలను వండి వార్చింది. 

అయితే తమన్నా త్వరగా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారని.. కానీ విజయ్ మాత్రం కెరీర్‌పై గట్టిగా ఫోకస్ పెట్టాలని అనుకున్నారని అందుకే ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ సరైన కారణం ఏంటనేది మాత్రం తెలియరాలేదు. ఈ వార్తల మధ్యనే తమన్నా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ , పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య కండీషన్స్ అనేవి ఎప్పుడు మొదలవుతాయో అక్కడ ప్రేమ ఉండదన్నారు.

ఎదుటి వ్యక్తి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నీ అభిప్రాయాలు చెప్పడం మొదలైతే అది వ్యాపారమని తమన్నా హాట్ కామెంట్స్ చేశారు. ప్రేమ జీవితంలో భాగస్వామి భావాలకు విలువ ఇవ్వాలని.. రిలేషన్‌లో ఉన్నప్పటి  కంటే లేనప్పుడే సంతోషంగా ఉన్నానని మిల్కీబ్యూటీ తెలిపారు. అలాగే భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని యువతకు ఆమె సూచించారు. ప్రస్తుతం తమన్నా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె మాటలను బట్టి విజయ్‌- తమన్నాల మధ్య గట్టిగానే ఏదో జరిగిందని తెలుస్తోంది. 



Comments