పూజా హెగ్డే పెళ్లీ పీటలెక్కనుందా?.. శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజలు అందుకేనా?
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో పలువురు నటీనటులు.. ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక వయసు 40లు, 30లు దాటినా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా కంటిన్యూ అవుతున్నారు కొందరు స్టార్స్. త్రిష, అనుష్క, అంజలి, తమన్నా, రాశీఖన్నా తదితరులు ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఈ లిస్ట్‌లోకే వస్తారు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిని దర్శించి, రాహుకేతు పూజలు చేయడంతో పూజా హెగ్డే పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
1990 అక్టోబర్ 13న ముంబైలో స్థిరపడిన కన్నడ కుటుంబంలో జన్మించారు పూజా హెగ్డే. తల్లిదండ్రులిద్దరూ దక్షిణాదికి చెందిన వారు కావడంతో ముంబైలో పెరిగినప్పటికీ దక్షిణ భారత ఆచార వ్యవహారాలనే అనుసరించారు పూజ. చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈమె తన 19వ ఏట మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. నాటి కాంటెస్ట్‌లో తొలి రౌండ్‌లో నిష్క్రమించాల్సి వచ్చింది.
ఓటమితో కృంగిపోకుండా ఓ సవాల్‌గా , గుణపాఠంగా తీసుకున్న పూజా హెగ్డే మరుసటి ఏడాది ఏకంగా మిస్ యూనివర్స్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. మిస్ ఇండియా పోటీల తర్వాత తమిళంలో ముగామూడీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన పూజా హెగ్డేకు టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అదే ఒక లైలా కోసం. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందలో ఆమె అందం, నటన యూత్‌కి పిచ్చెక్కించింది. ఈ దశలో హృతిక్ రోషన్ సరసన మొహంజదారోలో నటించే అవకాశం పూజా హెగ్డేను వరించింది. రెండేళ్ల అనంతరం తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన పూజా హెగ్డేకు వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడంతో పాటు ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కావడం కలిసొచ్చింది.
ఓ నాలుగేళ్ల పాటు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన పూజా హెగ్డేకు రాధేశ్యామ్ సినిమా షాకిచ్చింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన పూజ కెరీర్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత బీస్ట్, ఆచార్య వంటి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టులేకపోవడంతో సౌత్‌లో పూజా హెగ్డేకు ఆఫర్లు రావడం తగ్గిపోయింది. హిందీలోనూ ఆమె నటించిన సినిమాలు నిరాశ పరచడంతో పూజా కెరీర్ ఎండ్ స్టేజ్‌కు వచ్చిందని పుకార్లు వినిపించాయి.
ఎవ్వరూ ఊహించని విధంగా హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా, రజనీ కూలీ, సూర్య రెట్రో, ఇళయ దళపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్, కాంచన 4లోనూ పూజా హెగ్డే అవకాశాలు అందుకుని షాకిచ్చింది. అందరు హీరోయిన్ల మాదిరిగానే పూజా హెగ్డేపైనా పలు గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. కానీ వాటిని ఈ ముద్దుగుమ్మ ఖండిస్తూ వచ్చింది. తొలుత బాలీవుడ్ సూపర్‌స్టార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో పూజా రిలేషన్‌లో ఉందని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత బిగ్‌బాస్ ఫేమ్ రోహాన్ మెహ్రాతోనూ డేటింగ్ చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ప్రతీసారి తాను సింగిల్ అంటూ పూజా హెగ్డే తేల్చిచెప్పింది. 34 ఏళ్ల పూజ ఇంకెప్పుడు పెళ్లి పీటలెక్కుతారని అభిమానులు , సినీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటాయి. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే షాకిచ్చారు. ఏప్రిల్ 3న ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిని ఆమె సందర్శించి శ్రీకాళహస్తీశ్వరుడిని, జ్ఞాన ప్రసూనాంబను దర్శించుకున్నారు. అంతకుముందు రాహు కేతువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని, తన జాతకంలోని దోషాల నివృత్తి కోసమే పూజలు నిర్వహించారంటూ ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. అయితే త్వరలో తన కెరీర్, త్వరలో రిలీజ్ కానున్న తన సినిమాలు బాగా ఆడాలని ఆమె పూజలు నిర్వహించినట్లుగా కొందరు చెబుతున్నారు. ఈ ప్రత్యేక పూజల వెనుక రహస్యం ఏంటీ? శ్రీకాళహస్తి ఆమె ఎందుకు వచ్చింది? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Comments
Post a Comment