భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. 4 వేలకు చేరువలో కేసులు
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 4 వేల మార్క్‌కు చేరువైంది. దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 3,961 వద్ద ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జూన్ 2న వెల్లడించింది. కేరళలో అత్యధికగా 1435 కేసులు, మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, బెంగాల్‌లో 339, గుజరాత్‌లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్‌లో 149, ఒడిశాలో 12, హర్యానాలో 12, పంజాబ్‌లో 6 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 360 కొత్తగా కోవిడ్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక కోవిడ్ కారణంగా కేరళ, కర్ణాటకలలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కోవిడ్ కారణంగా భారత్‌లో మరణించిన వారి సంఖ్య 32కి చేరుకుంది. అలాగే జూన్ 2 ఉదయం 8 గంటల వరకు 2,188 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఇతర వేరియెంట్లతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా రకం తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందని సూచనలు ఏమీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు తాజా వేరియంట్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయని అభిప్రాయపడింది.
భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా రకాన్ని ఎన్‌బీ.1.8.1గా గుర్తించింది డబ్ల్యూహెచ్‌వో. అలాగే గడిచిన రెండు వారాలుగా భారత్‌లో ఎక్కువగా బీఏ .2, జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ల ప్రభావం తగ్గడం, కరోనా నిబంధనలను ప్రజలు పాటించకపోవడం, వ్యాధి నిరోధక శక్తి వంటివి తగ్గడం వల్లే దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Post a Comment