Kantara: Chapter 1 Day 12 Collections World Wide: కాంతార 12 రోజుల కలెక్షన్స్.. రజనీ, ప్రభాస్ రికార్డులు గల్లంతు
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన కాంతార చాప్టర్ 1 త్వరలో రెండు వారాలు పూర్తి చేసుకోనుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం తగ్గడం లేదు. తాజాగా 12వ రోజు వరల్డ్ వైడ్‌గా రిషబ్ శెట్టి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
కాంతార చాప్టర్ 1 చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు రిషబ్ శెట్టి. ఈ చిత్రంలో ఆయనకు రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. జయరామ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ స్వరకల్పన చేయగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటర్‌గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1కు 440 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా... ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 880 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ చిత్రం ఇప్పటి వరకు కర్ణాటకలో 142.7 కోట్ల రూపాయలు, తెలు రాష్ట్రాల్లో 78.15 కోట్ల రూపాయలు, హిందీలో 149.25 కోట్ల రూపాయలు, తమిళనాడులో 46 కోట్ల రూపాయలు, మలయాళంలో 35.8 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ వెబ్‌సైట్ ప్రకటించింది. దాంతో ఇండియాలో కాంతార చాప్టర్ 1 మూవీకి 451.9 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 540.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఓవర్సీస్‌లోని నార్త్ అమెరికా మార్కెట్‌లో రిషబ్ శెట్టి మూవీకి ఇప్పటి వరకు 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 35.4 కోట్ల రూపాయలు) వచ్చినట్లు కాంతార చాప్టర్ 1 మూవీకి నార్త్ అమెరికాలో పంపిణీదారుగా వ్యవహరిస్తోన్న ప్రత్యంగిరా మూవీస్ ట్విట్టర్‌లో ప్రకటించింది. నార్త్ అమెరికాను మినహాయిస్తే ఇతర దేశాల్లో 60 కోట్ల రూపాయల్ని ఈ చిత్రం రాబట్టింది. దీంతో కాంతారకు ఓవర్సీస్ నుంచి 95 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కాంతార చాప్టర్ 1 చిత్రం 12 రోజుల నాటికి ప్రపంచవ్యాప్తంగా 635 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. అయితే 11 రోజుల్లో ఈ సినిమా 655 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు హోంబలే ఫిలింస్ ప్రకటించింది. తెలుగు హీరో కాకుండా తెలుగు రాష్ట్రాలలో 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మూడో హీరోగా రిషబ్ శెట్టి నిలిచాడు. గతంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (3 సార్లు), యశ్ (ఒకసారి) ఈ ఫీట్ అందుకున్నారు.
కాంతార చాప్టర్ 1 ఫస్ట్ వీక్ కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు తొలి వారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 337.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో కర్ణాటక నుంచి 106.95 కోట్ల రూపాయలు, తెలుగులో 63.55 కోట్ల రూపాయలు, హిందీలో 108.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 31.5 కోట్ల రూపాయలు, మలయాళంలో 26.65 కోట్ల రూపాయలు వచ్చింది.
కర్ణాటకలో ఇప్పటికే అత్యంత వేగంగా 150 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను దాటేసిన కాంతార చాప్టర్ 1 త్వరలో 200 కోట్ల మార్క్‌ను అందుకోవాలని చూస్తోంది. తద్వారా కర్ణాటకలో సోలోగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి కన్నడ మూవీగా నిలవనుంది. 12 రోజుల నాటి వసూళ్లతో... అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో జైలర్ (650 కోట్ల రూపాయలు), సుల్తాన్ (623 కోట్ల రూపాయలు) వసూళ్లను అధిగమించింది.
Comments
Post a Comment