రామ్ పోతినేని విధ్వంసం... ఆంధ్రా కింగ్‌కి భారీ వసూళ్లు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హిట్ కొట్టి చాలాకాలమే అవుతోంది. చివరిసారిగా ఇస్మార్ట్ శంకర్‌తో విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో కెరీర్‌లో నిలబడాలంటే అతనికి హిట్ కంపల్సరీ. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని చేసిన సినిమాయే ఆంధ్రా కింగ్ తాలూకా. అభిమానులు హీరోలపై చూపించే ప్రేమ, సినీరంగంలోని పరిస్ధితులే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ బ్యాక్‌డ్రాప్‌లో గతంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కథ, కథనం డిఫరెంట్‌గా ఉందని చిత్ర యూనిట్ తొలి నుంచి చెబుతూనే వచ్చింది.
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నెనీలు సంయుక్తంగా నిర్మించారు. రామ్ పోతినేని సరసన మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించారు. కన్నడ అగ్రనటుడు, రియల్ స్టార్ డాక్టర్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు.
నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. 27 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనిని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 30 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం తొలిరోజున మంచి వసూళ్లు రాబట్టింది. ఇండియా వైడ్‌గా ఈ సినిమాకు 2,511 షోలు ప్రదర్శితం అవ్వగా.. 30.72 శాతం ఆక్యూపెన్సీ అందుకుని 4.36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 3 కోట్ల రూపాయలు రాబట్టడంతో ఇప్పటి వరకు ఆంధ్రా కింగ్ తాలూకాకు ఇండియాలో 8.4 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఓవర్సీస్‌లో రామ్ పోతినేని సినిమా ఎదురులేకుండా సాగుతోంది. తొలిరోజు 275K డాలర్లు (భారత కరెన్సీలో 2.45 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది రామ్ కెరీర్‌లో నార్త్ అమెరికాలో తొలి రోజు వచ్చిన అత్యధిక మొత్తం. రెండో రోజు వసూళ్లతో కలిపి నార్త్ అమెరికాలో ఆంధ్రా కింగ్ తాలూకా కలెక్షన్స్ 300K డాలర్లు (భారత కరెన్సీలో 2.68 కోట్ల రూపాయలు) క్రాస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్‌లో వస్తోన్న ఆదరణ నేపథ్యంలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేలు నార్త్ అమెరికాలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సినిమా వీకెండ్‌లోగా 20 కోట్లు క్రాస్ చేస్తుందని రామ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
.jpg)
Comments
Post a Comment