మిడ్ వీక్ ఊహించని ఎలిమినేషన్?‌ బిగ్‌బాస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

 


బిగ్‌బాస్ తెలుగు 9లో మరికొద్ది గంటల్లో 9వ వారం ముగిసి 10వ వారంలోకి అడుగుపెట్టనుంది. ఇక వీకెండ్ వస్తుందంటే ఖచ్చితంగా ఎలిమినేషనా? లేక సింగిల్ ఎలిమినేషనా అనేది సస్పెన్స్‌గా ఉంటుంది. మరో 5 వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ముగియనుంది. ఫైనల్ ఎపిసోడ్ నాటికి టాప్ 5ని సిద్ధం చేయాలంటే డబుల్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. దీనికి తగినట్లుగానే బిగ్‌బాస్ టీమ్ పావులు కదుపుతోంది. గత కొన్ని వారాలుగా డబుల్ ఎలిమినేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెబుతున్నారు.

ఈ వారం నామినేషన్స్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9లో 9వ వారం నాటికి హౌస్‌లో తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్, రీతూ చౌదరి, భరణి శంకర్, దివ్య నిఖిత, గౌరవ్ గుప్తా, పడాల పవన్ కళ్యాణ్, నిఖిల్ నాయర్, పవన్ డిమోన్, సుమన్ శెట్టి, శ్రీనివాస్ సాయి ఉన్నారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఇక 9వ వారం సుమన్ శెట్టి, భరణి శంకర్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, తనూజ పుట్టస్వామిలు నామినేషన్స్‌లో ఉన్నారు.

ఓటింగ్‌లో పవన్ కళ్యాణ్ జైత్రయాత్ర:

బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారి ఓటింగ్ పరిశీలిస్తే..  పవన్ కళ్యాణ్ పడాల (21.85 శాతం), తనూజ పుట్టస్వామి (16.87 శాతం), రాము రాథోడ్ (15.9 శాతం), భరణి (15.06 శాతం), సంజన గల్రానీ (13.05 శాతం), సుమన్ శెట్టి (8.99 శాతం), శ్రీనివాస్ సాయి ( 8.63 శాతం) చొప్పున లకు ఓటింగ్ నమోదైంది. దీని ప్రకారం సుమన్ శెట్టి, సాయి శ్రీనివాస్‌లు డేంజర్‌ జోన్‌లో ఉన్నవారు. వీరిద్దరిలో సాయికి అతి తక్కువ ఓటింగ్ రావడంతో 9వ వారం ఆయన ఎలిమినేట్ అవుతాడని వార్తలు వస్తున్నాయి.

మిడ్ వీక్ ఊహించని ఎలిమినేషన్:

బిగ్‌బాస్ తెలుగు 9లో వీకెండ్ రాకుండానే ఎలిమినేషన్‌ విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా, ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దివారాలుగా రాముకి ఇంటిపై బెంగ ఎక్కువైంది. నామినేషన్స్‌లో, టాస్క్‌లలో ఏమాత్రం శ్రద్ధగా ఆడటం లేదు.. ఏదో ఆడాలి కాబట్టి ఆడటం, ఉన్నామని ఉనికిని చాటుకోవడం చేస్తున్నాడు. తనకు ఇల్లు గుర్తొస్తుందని ఇప్పటికే అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాడు. 

అమ్మానాన్న గుర్తొస్తున్నారంటూ:

శనివారం హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. రాముతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక నా వల్ల కావడం లేదని.. ఇంటికి పోతానని పాట రూపంలో తన ఆవేదనను వెల్లబుచ్చాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని.. ఇప్పుడు జీవితంలో సెటిల్ అయ్యాక కూడా ఇంకా వాళ్లకి దూరంగా ఉండలేకపోతున్నానని రాము చెప్పాడు. దాంతో బిగ్‌బాస్ గేట్స్ తెరవాలని నాగార్జున చెప్పగానే డోర్స్ ఓపెన్ అయ్యాయి.. అందరికీ వీడ్కోలు చెప్పి రాము రాథోడ్ ఈ వారం సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లుగా కథనాలు వస్తున్నాయి. దాంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఊహించని ఎలిమినేషన్ కాగా.. ఆదివారం ఎలిమినేషన్ ఉంటుందా? లేక రాము ఎలిమినేషన్‌తో సరిపెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది. 


Comments