డిజాస్టర్‌గా మాస్ జాతర.. రవితేజ షాకింగ్ డెసిషన్
గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. తన కష్టం, ప్రతిభతో హేమాహేమీలున్న టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మాస్ మహారాజ రవితేజ. ప్రయోగాలకు దూరంగా, ప్రేక్షకులకు వినోదం అందించడమే ధ్యేయమని నమ్మి పక్కా కమర్షియల్ హీరో అనిపించుకున్నారు రవి. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించని విధంగా తన సినిమాలు ఉంటాయి. రవితేజ సినిమా అంటే 100 శాతం వినోదం పక్కా అని థియేటర్‌కు వచ్చే వారే ఎక్కువ. అయితే వరుసగా రవితేజ సినిమాలు బోల్తా కొడుతూ ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
రోటీన్‌గా రవితేజ నటన:
వరుసగా సినిమాలు బోల్తా కొట్టేస్తున్నా అదే బాడీ లాంగ్వేజ్, అదే రోటీన్ యాక్షన్‌తో సినిమాలు దించుతూ ప్లాపులు ఎదుర్కొంటున్నారు రవితేజ. ఒకప్పుడు రవితేజ అంటే భిన్నమైన పాత్రలు, నటనలో కొత్తదనం చూపించేవాడు. కానీ నేడు ఆయన పక్కా కమర్షియల్ హీరోగా మారిపోయారు. మూడేళ్ల క్రితం ధమాకా, వాల్తేర్ వీరయ్యలతో మంచి ఊపులో ఉన్నారు రవితేజ. కానీ ఆ తర్వాత చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి హిట్ కొట్టాలనే కసితో తనకు అచ్చొచ్చిన శ్రీలీలతో కలిసి రవితేజ సినిమా మాస్ జాతర.
లక్ తీసుకురాని శ్రీలీల:
రవితేజ సినీ కెరీర్‌లో 75వ చిత్రంగా, మైల్‌స్టోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మాస్ జాతర. విడుదలకు ముందు రవితేజ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాను పెంచేశాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు మాస్ జాతర సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రవితేజ వీరాభిమాని, సినీ రచయిత భాను భోగవరపు ఈ మాస్ జాతర సినిమాకు దర్శకత్వం వహించారు.
డిజాస్టర్‌గా మాస్ జాతర:
90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన మాస్ జాతర సినిమా.. వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దాంతో రవితేజ సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 52 కోట్ల రూపాయలు రాబట్టాలని బ్రేక్ ఈవెన్‌గా నిర్ణయించారు. భారీ అంచనాల నేపథ్యంలో మాస్ జాతర ప్రీమియర్స్‌కు ఇండియాలో 3.1 కోట్ల రూపాయలు రాగా.. ఫస్ట్ డే 4.2 కోట్ల రూపాయలు వచ్చాయి. తొలి వారం 14.55 కోట్ల రూపాయలు వసూలు చేసిన మాస్ జాతర .. ఆ తర్వాత క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో 16.36 కోట్ల రూపాయల నెట్.. 18.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ నుంచి కోటి రూపాయల వరకు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో రవితేజ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 19.5 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ నేపథ్యంలో మాస్ జాతర మూవీ డిజాస్టర్‌గా నిలిచి.. నిర్మాత నాగవంశీకి భారీ నష్టాలను తెచ్చిపెట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రవితేజ షాకింగ్ డెసిషన్:
వరుస డిజాస్టర్స్‌తో రవితేజ డైలమాలో పడ్డారు. కెరీర్‌లో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాలని బలంగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఆయన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నారు. మాస్, కమర్షియల్ ఫార్ములాకు దూరంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం రవితేజ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. సినిమా హిట్ అయిన తర్వాత లాభాల్లో వాటాల రూపంలో రవితేజకు రెమ్యునరేషన్ చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీని కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హాయాతి, ఆషికా రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల కానుంది.

Comments
Post a Comment