‘నా బట్టలపైనే కన్ను... చీర కట్టుకుని జిమ్ చేయలేనుగా’
సోషల్ మీడియా వచ్చాక సామాన్యులతో పాటు ప్రముఖులు ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కొందరు సెలబ్రిటీలు వీటికి పబ్లిక్‌గానే రియాక్ట్ అవుతుండగా.. మరికొందరు మాత్రం మనకెందుకులే అని మౌనంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్‌స్టార్స్ తమపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననంపై కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పలు సందర్భాల్లో నెగిటివ్ ట్రోలింగ్‌ను చీల్చి చెండాడుతున్నారు. ఈ కోవలోకే వస్తారు నటి ప్రగతి.
ఇప్పుడంటే సీనియర్ హీరోయిన్లు క్యారెక్టర్ రోల్స్ వేస్తున్నారు కానీ.. పది, పదిహేనేళ్లు వెనక్కి వెళితే ఈ తరహా పాత్రలకు సెపరేట్‌గా ఓ బ్యాచ్ ఉండేది. సుధ, హేమ, సురేఖా వాణి తదితరులు అమ్మ, అక్క, వదిన పాత్రలు వేసేవారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు ప్రగతి. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రగతి అసలు పేరు ప్రగతి మహావాది. తొలుత మోడల్‌గా పనిచేసిన ప్రగతి.. మైసూర్ సిల్క్ శారీస్ కోసం పనిచేశారు. ఈ దశలో తమిళ నటుడు, దర్శకుడు కే భాగ్యరాజ్ కళ్లలో పడిన ప్రగతి.. వీట్ల విశేషంగా అనే తమిళ చిత్రంతో నటిగా మారారు. తమిళ చిత్రరంగంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో పెళ్లి చేసుకోవడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.
అయితే తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ప్రగతి... తల్లి, అక్క, వదిన పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. అలాగే బుల్లితెరపైనా సక్సెస్ కావడంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ప్రగతి ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫిట్‌నెస్, వర్కవుట్, జిమ్ వీడియోలు, ఫోటోలను అప్‌లోడ్ చేసేవారు. ఆ తర్వాత ఒకరోజు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని పతకాలు సాధించడంతో చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పోటీలలో పాల్గొని పతాకాలు సాధించిన ప్రగతి.. ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా నాలుగు పతకాలను గెలవడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. భారతీయ చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల వయసులో క్రీడల్లో పాల్గొన్న వ్యక్తిగా ప్రగతి రికార్డుల్లోకెక్కారు. ఆమె గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ విజయం నేపథ్యంలో పలు సంఘాలు, సంస్థలు ఆమెను సన్మానిస్తున్నాయి. దీనిలో భాగంగా త్రీ రోజెస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నటి ప్రగతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ట్రోలింగ్‌పై ప్రగతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అటెన్షన్ చాలా ఎక్కువగా ఉంది. అందుకని టెన్షన్‌గా ఉంది. కొంచెం మాట అటు ఇటు తడబడితే దయచేసి క్షమించండి. మీ మనిషిని, మీ ఆర్టిస్ట్‌ని ఎన్నో ఏళ్లుగా అమ్మగా ఉన్నాను. మాట ఏమైనా దొర్లితే ప్లీజ్ క్షమించండి. ఇంత అటెన్షన్ ఎప్పుడూ రాలేదు.. నేను కొంచెం. మీడియాకు దూరంగా ఉంటాను. పబ్లిక్ ఈవెంట్స్‌ను తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాను. మాట్లాడటానికి కొంచెం భయం. భయం ఎందుకంటే మళ్లీ నెక్ట్స్ రోజు ట్రోల్ అవుతానేమోనని. సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్ చేస్తోందన్నారు.. కానీ సినిమాలు ఎప్పటికీ మానలేను, సినిమా లేకపోతే నేను బతకలేను. ప్రగతి అనే పేరు ఇచ్చింది అదే.. నా పిల్లలు పెరిగింది అదే.. నేను ఇంత దూరం బతికింది అదే. నా ఇంటి రెంట్ దగ్గరి నుంచి నా ఇల్లు కొనుక్కునే వరకు, ఈ రోజు నేను అన్నం తింటున్నానంటే సినిమాయే కారణం. నా తుది శ్వాస వరకు సినిమాలలో నటిస్తూనే ఉంటా. సెట్‌లోనే పోతాను అని ప్రగతి తెలిపారు.
వెళ్లిపోతానని అనుకోవద్దు... గ్యాప్ ఇచ్చాను, వాళ్లు ఇచ్చారు. చిన్న గ్యాప్ వచ్చింది అంతే. నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ నాకు రావడం లేదు.. నేను అనుకుంటున్నవి వాళ్లకీ ఇవ్వాలని అనిపించడం లేదు. ఎక్కడో చిన్న మిస్ అండర్‌స్టాండింగ్‌లో చిన్న గ్యాప్ వచ్చింది. మళ్లీ రేపటి నుంచే నా యాక్టింగ్ మొదలవుతోంది. ఒక తమిళ చిత్రంలో విలన్‌గా చేస్తున్నాను. ఈ లోపు సినిమా కోసం వెయిట్ చేయడం.. ఎక్కడైనా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానేమోనని ఆ ఎనర్జీని పవర్ లిఫ్టింగ్‌కి టర్న్ చేశాను. ఈరోజు మనదేశం జెండా వేసుకుని సిల్వర్ పతకం మన ఇంటికి తెచ్చాను. ఏదో సరదాగా మొదలుపెట్టింది అంత ఎనర్జీతోటి దేశానికి అంత పేరు తెచ్చానంటే, ఇదే ఎనర్జీకి కరెక్ట్‌గా క్యారెక్టర్ పడితే. ప్రగతి మహావాదిగా అక్కడ ప్రాతినిథ్యం వహించినా.. నా సినిమా ఫ్యామిలీని రిప్రజెంట్ చేశాననే అనుకుంటున్నా. అంత పెద్ద ఒక స్టేజ్‌లో, నేను అంత థైర్యంగా నిలబడగలిగానంటే.. అది అనుభవంతో అయ్యుండొచ్చు. ఆ స్టేజ్ ఫియర్ లేకపోవడం అయ్యుండొచ్చు అని ప్రగతి చెప్పారు.
స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఈ వయసులో అవసరమా? జిమ్‌కి జిమ్ బట్టలే వేసుకోవాలి నేను చీర కట్టుకుని, చుడిదార్ వేసుకుని చేయలేను. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఏమైనా తప్పు చేస్తున్నామా ఇంత దరిద్రంగా తిడుతున్నారేంటీ? ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారు? నేను తప్పు చేస్తున్నానా? ఎదిగిన కూతురు ఉంది? ఆ పిల్ల స్కూల్‌కి వెళ్తుంది? కాలేజ్‌కి వెళ్తుంది? ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత మాటలు అనేది బాధపడ్డా. ఆ బాధకి ఆన్సర్‌గా ఈరోజు అందరికీ వచ్చింది. ఎవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండీ నా ఆన్సర్. ఈ ఏషియన్ గేమ్స్‌లో నాకొచ్చిన మెడల్స్‌ని నేను సినిమాకు సంబంధించిన ప్రతి లేడీ ఆర్టిస్ట్‌కి నేను డెడికేట్ చేస్తున్నాను ప్రగతి అన్నారు.
మాట అనడం చాలా ఈజీ. అమ్మాయిని చూడగానే ఒక ఫోటో పెట్టి మాటలు రాసేయడం చాలా ఈజీగా రాసేస్తారు. వాళ్లకి ఒక ఫ్యామిలీ ఉంటుంది.. వాళ్లకి పిల్లలుంటారు.. వాళ్లకి పరువు ఉంటుంది.. వాళ్లకి బాధ ఉంటుంది. దయచేసి కామెంట్ చేసే ముందు ఒక నిమిషం ఆలోచించండి. మీరు ఏది ఇవ్వకపోయినా మాకు కొంచెం మర్యాద ఇవ్వండి. సినిమా నుంచి ఎవ్వరూ మీకు విష్ చేయలేదా? అనే మెసెజ్‌లు చాలా వచ్చాయి.. మంచు లక్ష్మీ గారు, బ్రహ్మానందంగారు నాకు విష్ చేశారు. నాతో కలిసి యాక్ట్ చేయని హీరో లేరు, నాతో కలిసి యాక్ట్ చేయని హీరోయిన్ లేదు. నేను పనిచేయని పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేరు. అయితే నేను చాలా చిన్న నటిని. కానీ నేనెప్పుడూ ఎస్‌కేఎన్ గారితో వర్క్ చేయలేదు.. మారుతి గారితో నేను వర్క్ చేయలేదు. కానీ ఈరోజు నన్ను పిలిచి సత్కరించినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు అని ప్రగతి ముగించారు.
.jpg)
Comments
Post a Comment