Bigg Boss Telugu 9 Grand Finale Voting: ఓటింగ్‌లో దూసుకొస్తోన్న సంజన... కళ్యాణ్- తనూజలకు టఫ్ ఫైట్

 


బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు మరో నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దాదాపు 100 రోజులకు పైగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది బిగ్‌బాస్ 9. 14వ వారంతో ఎలిమినేషన్స్ పూర్తవ్వగా ఐదుగురు  కంటెస్టెంట్స్ ఫైనలిస్టులుగా టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. వారు పడాల పవన్ కళ్యాణ్, తనూజా పుట్టస్వామి, సంజన గల్రానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్‌లు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 9 విజేత కానున్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ జరిగింది. ఆ రోజున 9 మంది సెలబ్రిటీలు, 6గురు కామన్‌మెన్‌లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో కామన్‌మెన్ దివ్య నిఖిత కంటెస్టెంట్‌గా వచ్చింది. అనంతరం ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తొలి వారం శ్రష్టీ వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియాశెట్టి, నాలుగో వారం హరిత హరీశ్, ఐదో వారం శ్రీజ దమ్ము, ఫ్లోరా షైనీ, ఆరో వారం ఆయేష్ జీనత్, ఏడో వారం రమ్య మోక్ష కంచర్ల, ఎనిమిదో వారం దివ్వెల మాధురి, తొమ్మిదో వారం రాము రాథోడ్, పదో వారం శ్రీనివాస సాయి, పదకొండో వారం నిఖిల్ నాయర్, పన్నెండో వారం గౌరవ్ గుప్తా, పదమూడో వారం దివ్య నిఖిత, రీతూ చౌదరి, పద్నాలుగో వారం సుమన్ శెట్టి, భరణిలు ఎలిమినేట్ అయ్యారు. 

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పడాల టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో గెలిచి బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీ, తనూజ పుట్టస్వామిలు బిగ్‌బాస్‌ తెలుగు 9 ఫైనల్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు డిసెంబర్ 21వ తేదీ ఆదివారం జరిగే ఫైనల్‌లో ఈ సీజన్ విజేత కానున్నారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా.. ఓటింగ్ టఫ్‌గా సాగుతోంది. పడాల పవన్ కళ్యాణ్, తనూజ పుట్టస్వామిల మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే..

పడాల పవన్ కళ్యాణ్‌ తొలిరోజున ఆధిపత్యం వహించగా.. రెండో రోజు నాటికి తనూజ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. పవన్ కళ్యాణ్‌కు 37.23 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. తనూజకు 31.48 శాతం ఓటింగ్ వచ్చింది. అయితే అనూహ్యంగా సంజన గల్రానీ దూసుకొస్తున్నారు.. నిన్నటి వరకు ఓటింగ్‌లో అట్టడుగున ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 19.98 శాతం ఓటింగ్‌తో మూడో స్థానంలోకి వచ్చేసింది. ఈమెకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా కళ్యాణ్, తనూజలకు నిరాశ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటింగ్‌లో ఆ తర్వాతి స్థానాల్లో డిమోన్ పవన్ (6.01 శాతం), జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (5.3 శాతం) ఓటింగ్‌తో నిలిచారు. ఓటింగ్ లైన్స్ మరికొద్దిరోజులు ఓపెన్‌లోనే ఉండనున్నాయి.. దీంతో బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా ఎవరు నిలుస్తారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


Comments