ఆగిపోయిన స్టార్ హీరోయిన్ పెళ్లి? షాక్‌లో చిత్ర పరిశ్రమ!

 


2025 సంవత్సరం మరో పది రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనుంది. అయితే ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కగా.. మరికొందరు తాము రిలేషన్‌లో ఉన్నట్లు బయటపెట్టారు. ఇంకొందరైతే పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయతే పీటల దాకా వచ్చి పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంథాన - మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ల పెళ్లి చివరి నిమిషంలో రద్దయ్యింది. 

పెద్దలు నిర్ణయించిన ప్రకారం వీరిద్దరి పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు స్మృతి తండ్రి గుండెపోటుకు గురికావడంతో పెళ్లిని అర్ధాంతరంగా ఆపేశారు. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే వరుడు పలాశ్ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఈ పెళ్లి జరుగుతుందా? లేదా? అనుమానాలు రావడంతో పాటు స్మృతి, పలాశ్‌ల జీవితంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. వీటిని ఇరు కుటుంబ సభ్యులు ఖండించడంతో పాటు త్వరలోనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ చివరికి ఊహాగానాలే నిజమయ్యాయి. 

పలాశ్ ముచ్చల్‌లో వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అటు పలాశ్ కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు. ప్రేమలో పడి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరి మధ్య విడిపోయేంతగా ఏం జరిగింది? ఎలాంటి కారణాలు చోటు చేసుకున్నాయి? అంటూ సినీ, క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి కూడా పీటల దాకా వచ్చి ఆగిపోయినట్లుగా సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కోలీవుడ్ ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్. తమిళనాడులోని మధురైలో 1990 నవంబర్ 30న జన్మించారు నివేదా. అనంతరం వీరి కుటుంబం కోవిల్‌పట్టికి మకాం మార్చింది. ఆమెకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వీరి తల్లిదండ్రులు దుబాయ్‌కి వలస వెళ్లారు. ఎడిన్‌బర్గ్‌లోని హెరియట్ వాల్ట్ యూనివర్సిటీ‌లో మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు నివేదా. 

చదువు తర్వాత మోడలింగ్‌లోకి దిగిన నివేదా పేతురాజ్.. 2015లో మిస్ ఇండియా యూఏఈగా విజయం సాధించారు. అనంతరం మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌ పోటీలలో పాల్గొని టాప్ 5లో నిలిచారు. ఈ దశలో సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నించింది. 2016లో ఓరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నివేదా. తెలుగులో మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరు, అల వైకుంఠపురంలో, రెడ్, పాగల్, బ్లాడీ మ్యారీ, విరాట పర్వం, దాస్ కా దమ్కీ, బూ తదితర చిత్రాలలో నటించారు. 

తమిళ చిత్రాలలో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న నివేదా పేతురాజ్... తెలుగులో మాత్రం సెకండ్ హీరోయిన్‌గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2023లో చివరిసారిగా బూ చిత్రంలో నటించిన నివేదా తర్వాత కొత్తగా ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఆమె నటించిన పార్టీ అనే చిత్రం విడుదలకు సైతం నోచుకోలేదు. ఆఫర్లు రాకపోవడంతో పెళ్లి చేసుకుని స్థిరపడిపోవాలని నివేదా థామస్ నిర్ణయించుకున్నారు. అయితే గడిచిన ఐదేళ్లుగా నివేదా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం తన ప్రేమను బయటపెట్టిన నివేదా.. రజిత్‌ను పెళ్లాడబోతున్నట్లుగా చెప్పింది. డిసెంబర్ చివరి నాటికి వీరి వివాహం జరుగుతుందని అంతా అనుకున్నారు. దీనికి తగినట్లుగా ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అయితే నివేదా - రిజత్‌ల పెళ్లి రద్దయినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు రొమాంటిక్ ఫోజుల్లో కలిసున్న ఫోటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఇద్దరూ ఏకకాలంలో డిలీట్ చేశారు. అంతేకాదు.. నివేదా, రజత్‌లు ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. దాంతో నివేదా - రజత్‌ల పెళ్లి రద్దయినట్లేనని గాసిప్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఇద్దరిలో ఒకరు స్పందించాల్సిందే.


Comments