విడాకులు దురదృష్టకరమే... నాగచైతన్య

 


గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు షాకిచ్చారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని ఆమె పెళ్లాడారు. తమిళనాడులోని కోయంబత్తూరు శివార్లలో ఉన్న ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి ఆలయంలో సమంత - రాజ్ నిడిమోరుల పెళ్లి జరిగింది. 

పెళ్లిలోనూ సమంత కొత్త దారిని ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తోన్న భూత శుద్ది ప్రక్రియలో సమంత- రాజ్ నిడిమోరుల వివాహం జరిగినట్లు ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం పెళ్లి ఫోటోలను సమంత సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అయితే సమంత పెళ్లిపై చిత్ర పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన లేదు. ఒకరిద్దరు తప్పించి ఆమెకు విషెస్ తెలియజేసిన వారు కూడా లేరు.

ఇక సమంత మాజీ భర్త, హీరో అక్కినేని నాగచైతన్య కుటుంబం నుంచి కూడా ఎవరూ స్పందించలేదు. సమంత కొత్త జీవితంలోకి అడుగుపెడుతుండటంతో గతంలో నాగచైతన్య, సమంతల తాలూకా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో సమంతతో బ్రేకప్‌పై నాగచైతన్య చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. 

ప్రముఖ జర్నలిస్ట్‌ ప్రేమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. నా పర్సనల్ లైఫ్‌లో జరిగింది దురదృష్టకరం.. నా వైవాహిక జీవితానికి చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ ఈ మీడియా ఆ ఇష్యూని రకరకాలుగా రాసింది. పబ్లిక్‌కు మా బంధంపై ఉన్న రెస్పెక్ట్‌ను తీసేస్తున్నారు.. అది నా మనసును తీవ్రంగా గాయపరిచింది అని నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.

విడాకులు అయిపోయాయి, కాలం గడుస్తోంది.. అయినా ఇంకా దానినే పట్టుకుని వేలాడుతున్నారు. జస్ట్ హెడ్ లైన్స్ కోసం మన పేర్లు పెట్టి ఇంకో మూడో పేరుని అటాచ్ చేసి ఏదో క్రియేట్ చేసి తప్పుగా మాట్లాడి.. వాళ్ల ఫ్యామిలీని ఇన్‌వాల్వ్ చేయడం కొంచెం బాధగా అనిపించింది. నా జీవితంలో దురదృష్టకర సంఘటన జరిగింది.. కానీ ఆ అధ్యాయం ముగిసిపోయింది. ఇంకా హెడ్‌లైన్స్ కోసం సాగదీయడం అనేది తప్పు అని నాగచైతన్య పేర్కొన్నారు. నేను, సామ్ ఇద్దరం స్టేట్‌మెంట్ ఇచ్చాం.. అయినా ఇంకా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు. సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి అని నాగచైతన్య వ్యాఖ్యానించారు.

Comments