Vilayath Buddha: పృథ్వీరాజ్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా... విలయత్ బుద్దాకు ఎన్ని కోట్ల నష్టమంటే?
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం విలయత్ బుద్ధా. ఊర్వశి థియేటర్స్, ఏవీఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందీప్ సేనన్, ఏవీ అనూప్‌లు సంయుక్తంగా నిర్మించారు. జీఆర్ ఇందుగోపన్ రాసిన నవల విలయత్ బుద్ధా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జయన్ నంబియార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అరవింద్ ఎస్ కశ్యప్, రేణదివ్‌లు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించగా.. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
విడుదలకు ముందు విలయత్ బుద్ధా పలు వివాదాల్లో చిక్కుకుంది. గంధపు చెక్కల ఇతివృత్తంతో అప్పటికే తెలుగులో పుష్ప సినిమా రావడంతో భారీగా ట్రోలింగ్ నడిచింది. అయితే దీనికి పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు చిత్ర యూనిట్ ధీటుగా బదులిచ్చింది. అన్ని అడ్డంకులను దాటుకుని నవంబర్ 21న విలయత్ బుద్ధా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తన థియేట్రికల్ రన్ దాదాపుగా ముగించడంతో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్‌పై విశ్లేషణ చూద్దాం.
విలయత్ బుద్ధాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ప్రియంవద కృష్ణన్ హీరోయిన్‌గా నటించారు. షమ్మీ తిలకన్, సూరజ్ వింజరమూడు, అను మోహన్, రాజశ్రీ, తిజయ్ అరుణాసలం, ధ్రువన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి విలయత్ బుద్ధాకు 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన విలయత్ బుద్ధా చిత్రం ఎక్కడా పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. నెగిటివ్ ట్రోలింగ్ ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది. దాంతో తొలిరోజు 1.7 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. రెండో రోజు కోటి రూపాయలు, రెండో రోజు 75 లక్షల రూపాయలు, నాలుగో రోజున 35 లక్షల రూపాయలు, ఐదో రోజు 35 లక్షల రూపాయలు, ఆరో రోజున 25 లక్షల రూపాయలు, ఏడో రోజున 20 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. తొలి వారం కర్ణాటకలో 29 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల రూపాయలు, తమిళనాడులో 13 లక్షల రూపాయలు, కేరళలో 13 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.
ఆ తర్వాత క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది విలయత్ బుద్ధా. 17 రోజుల వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఇండియాలో 5.2 కోట్ల రూపాయల నికర వసూళ్లను, 6.05 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 2.6 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో విలయత్ బుద్ధా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8.65 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. దాంతో కేవలం 13 శాతం మాత్రమే రికవరి చేసి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది విలయత్ బుద్ధా.

Comments
Post a Comment