ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే విమానాశ్రయాలు .. టాప్ 10లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..?
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్, విమానాశ్రయాల ప్రమాణాలను కొలిచే గ్లోబల్ ఆర్గనైజేషన్ .. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2023లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే ఎయిర్‌పోర్ట్‌ల లిస్ట్‌లో 10వ స్థానంలో నిలిపింది. 2022లో ఐజీఐ ఈ లిస్ట్‌లో 9వ స్థానంలో, 2021లో 13వ స్థానంలో వుంది. 2019లో కరోనా మహమ్మారి విజృంభించడానికి ముందు 17వ స్థానంలో నిలిచింది.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 7.22 కోట్ల మంది ప్రయాణీకులను హ్యాండిల్ చేస్తుందని ఏసీఐ సోమవారం షేర్ చేసిన డేటా వెల్లడించింది. అమెరికాలోని హార్ట్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం 10.46 కోట్ల మంది ప్రయాణీకులతో అగ్రస్థానంలో నిలిచింది.
Also Read : 'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?
మొత్తం ప్రయాణీకుల రద్దీకి సంబంధించి మొదటి 10 ర్యాంకింగ్‌లలో ఐదు విమానాశ్రయాలు అమెరికాలో వున్నాయి. 2022లో 16వ స్థానం నుంచి 2023లో 5వ స్థానానికి చేరుకున్న టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో అతిపెద్ద జంప్‌గా నమోదు చేయబడింది.
2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రయాణీకుల అంచనా 8.5 బిలియన్లకు దగ్గరగా వుందని ఇది కోవిడ్‌కు ముందు స్థాయిల నుంచి 93.8 శాతం గణనీయమైన రికవరీని నమోదు చేసిందని సంస్థ వెల్లడించింది. 2023లో గ్లోబల్ ఎయిర్ ట్రావెల్ ప్రధానంగా అంతర్జాతీయ సెగ్మెంట్ అనేక కారకాలతో ప్రేరేపించబడింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిసారిగా రెండవ స్థానానికి చేరుకోగా.. ఇస్తాంబుల్, న్యూఢిల్లీ విమానాశ్రయాలు తిరుగులేని విధంగా అగ్రశ్రేణిలో నిలిచాయి. ఏసీఐ తాజా విమానాశ్రయ ర్యాంకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా 180కి దేశాల్లోని 2600కు పైగా విమానాశ్రాయల నుంచి సేకరించిన డేటాపై ఆధారపడి వున్నాయి.
Comments
Post a Comment