పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇరాన్, ఇజ్రాయెల్‌లకు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం వార్నింగ్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. హమాస్‌కు మద్ధతుగా నిలబడిన హెజ్‌బోల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా సిరియాపైనే విరుచుకుపడుతోంది. డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి.
ఈ ఘటనలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఏడుగురు టాప్ జనరళ్లు మృతి చెందారు. దీనిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారరు. ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని హెచ్చరించారు. దీంతో ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయొచ్చని కథనాలు వస్తున్నాయి. అయితే ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయకుండా తన మద్ధతున్న ఉగ్రవాద సంస్థలతో పరోక్ష యుద్ధానికి దిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : వామ్మో .. !! రూ.75,000 మార్క్ దాటిన బంగారం.. కొనాలా, వద్దా..?
ఈ పరిస్ధితులను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్, ఇజ్రాయెల్‌లకు ప్రయాణం చేయొద్దని భారతీయులకు సూచించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు జాగ్రత్తగా వుండాలని తెలిపింది. ఇజ్రాయెల్, ఇరాన్‌లో వుంటున్న వారు అక్కడి భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో వుండాలని విదేశాంగ శాఖ సూచించింది. తమ పేర్లను నమోదు చేసుకోవాలని.. బయట తిరిగే పనులకు దూరంగా వుండాలని సూచించింది.

Comments
Post a Comment