ఎక్కడ తగ్గాలో , ఎక్కడ నెగ్గాలో తెలుసు ..ఆ సీట్లు అందుకే వదులుకున్నా : పవన్ కళ్యాణ్




రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రజాగళం బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. బూతులు తిట్టి దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్‌లోనే వున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

దోపిడీపై దృష్టి వున్న నేతలు ప్రజల అవసరాలను ఎలా తీరుస్తారని పవన్ నిలదీశారు. మాట్లాడితే క్లాస్ వార్ అని జగన్ చెబుతున్నారని.. పోలీసుల శ్రమ శక్తిని జగన్ దోపిడీ చేశారని జనసేనాని దుయ్యబట్టారు. ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చి కొట్లాడాల్సి వస్తోందని.. ఇక్కడ దోచుకున్న సొమ్ముతో మరోచోట పరిశ్రమలు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల పేరుతో డబ్బులు దోచుకున్నారని.. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలన్నారు. 

Also Read : నాకు అనుభవం ... పవన్‌కు పవర్ , అగ్నికి వాయువు తోడైనట్లే : చంద్రబాబు

మా ఆశలను పక్కనబెట్టి ప్రజాకాంక్ష కోసమే పొత్తు అని.. జగన్ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు వస్తాయని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. 5 కోట్ల మందికి ఒకరిద్దరు సరిపోరని.. 3 పార్టీల బలం కావాలన్నారు. కేంద్రం సహాయ సహకారాలు రాష్ట్రానికి కావాలని.. యువత భవిష్యత్తు బాగుండాలనే తగ్గానని.. ఎక్కడ తగ్గాలో , ఎక్కడ నెగ్గాలో తనకు తెలుసునని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తణకులో జనసేన అభ్యర్ధిని ఖరారు చేసిన తర్వాత కూడా వెనక్కి తగ్గామని.. బీజేపీ కోసం అనకాపల్లి ఎంపీ సీటును వదులుకున్నామని ఆయన వెల్లడించారు. 



Comments