యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు : ఎంతమందికి ఐఏఎస్ , ఎంతమందికి ఐపీఎస్ వచ్చిందంటే..?
ఐఏఎస్ , ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ రిజల్ట్స్‌లో ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకులో నిలిచారు. ఆ తర్వాత అనిమేష్ ప్రధాన్ , దోనూరు అనన్య రెడ్డి, పీకే సిద్ధార్ధ్ రామ్ కుమార్, రుహాని, సృష్టి దబాస్, అన్‌మోల్ రాథోడ్, ఆశీష్ కుమార్, నౌషీన్, ఐశ్వర్యం ప్రజాపతిలు నిలిచారు. తెలుగు అభ్యర్ధి దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించడం విశేషం. గతేడాది కూడా తెలుగు అభ్యర్థిని ఉమాహారతి మూడో ర్యాంక్ సాధించారు.
2023 సెప్టెంబర్‌లో జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో వ్రాతపూర్వక భాగం, ఆ తర్వాత వ్యక్తిత్వ పరీక్ష కోసం నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ, గ్రూప్ బీకి నియామకం కోసం అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
Also Read : ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే విమానాశ్రయాలు .. టాప్ 10లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..?
మొత్తం 180 మంది అభ్యర్ధులు ఐఏఎస్‌కు ఎంపికవ్వగా.. 37 మంది ఐఎఫ్ఎస్‌కు, 200 మంది ఐపీఎస్‌కు, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏకి 613 మంది, గ్రూప్ బీ సర్వీస్‌కు 113 మంది ఎంపికయ్యారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అందుబాటులో వున్న ఖాళీల సంఖ్య మేరకు వివిధ సర్వీసులకు నియామకం జరిగింది.
Comments
Post a Comment