లోక్‌సభ ఎన్నికల బరిలో ‘‘ బర్రెలక్క ’’.. ఎక్కడి నుంచి అంటే ..?

 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. దీనిలో భాగంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఇవాళ స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నామినేషన్ వేశారు.

Also Read : 'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?

నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగండి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ తరపున మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు పోటీ చేస్తున్నారు.  బర్రెలక్క పోటీకి దిగడంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమె ఎవరి ఓట్లకు గండికొడుతుందోనన్న చర్చ నడుస్తోంది. 

ఎవరీ బర్రెలక్క :

కర్నె శిరీషది నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ . తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో ఆమె నివసిస్తోంది. తండ్రి వీరిని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో శిరీష తల్లి రోజుకూలీగా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరోవైపు బర్రెలక్క ఓపెన్ డిగ్రీ చేస్తూనే కుటుంబానికి ఆసరగా నిలిచేందుకు తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్లేది. నాలుగు బర్రెలను కొని, వాటి ద్వారా పాలు సేకరించి డబ్బు సంపాదిస్తోంది. 

Also Read : యూఏఈ : దుబాయ్‌లో వరదలా , ‘‘ క్లౌడ్ సీడింగ్ ’’ అంత పని చేసిందా ..?

ఓ రోజున నిరుద్యోగుల ఆవేదనను ప్రజలకు తెలియజేసేలా ఓ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది . డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ జీవిస్తున్నానంటూ బర్రెలక్క తీసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి శిరీష కాస్త బర్రెలక్కగా మారారు. సోషల్ మీడియాలో నిరుద్యోగుల పక్షాన గళమెత్తుతూ యువతలో ఫాలోయింగ్ సంపాదించారు. ఈ వీడియో చేసిన తర్వాత శిరీష చిక్కుల్లో పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వగా కోర్టుల చుట్టూ తిరిగారు. 

వేధింపులపై న్యాయ పోరాటం చేస్తున్న సమయంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడంతో ఆమె ఆ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నిలిచారు. యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు ఆమెకు మద్ధతుగా నిలిచారు. ఎన్నికల ప్రచారానికి కావాల్సిన డబ్బును విరాళాల రూపంలో అందజేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో వుండగా బర్రెలక్క సోదరుడిపై కొందరు దాడి చేసింది. దీంతో తనకు భద్రత కల్పించాల్సిందిగా శిరీష హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆమెకు గన్‌మెన్‌తో భద్రత కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Also Read : దూసుకెళ్తోన్న " వందే భారత్‌‌ ఎక్స్‌ప్రెస్ " .. ఏకంగా 2 కోట్ల మంది ప్రయాణం ..!!

కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికలో బర్రెలక్క ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ముచ్చెమటలు పట్టించారు. ఈ సందర్భంగా 5,754 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. తాను ఒక్క రూపాయి పంచకపోయినా నిజాయితీగా తనకు ఓటేశారని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపిన బర్రెలక్క చెప్పినట్లుగానే నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. 


Comments