అప్పట్లో నా కాళ్లు మొక్కిండు .. ఇప్పుడేమో రాజకీయాల్లోకి తెచ్చానన్న కృతజ్ఞత లేదు : భట్టిపై వీహెచ్ ఫైర్
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ్యుడు వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి తన కాళ్లు మొక్కారని ఆయన వ్యాఖ్యానించారు. మల్లు రవికి తాను టికెట్ ఇప్పిస్తే టెన్ జన్‌పథ్‌లో భట్టి విక్రమార్క తన కాళ్లు మొక్కారని.. అసలు ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే తానని కానీ ఆ కృతజ్ఞత భట్టికి లేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమించారని.. రాహుల్ ప్రోగ్రామ్‌లను, బహిరంగ సభలు సక్సెస్ చేశారని వీహెచ్ ప్రశంసించారు. అందుకే రేవంత్‌కు సీఎం అయ్యే ఛాన్స్ వుందని అన్నానని.. అప్పటి నుంచి భట్టి విక్రమార్క తనపై పగబట్టారని హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఖమ్మం టికెట్ నాకు రాకుండా కుట్ర చేస్తున్నారని భట్టిని ఉద్దేశించి ఆరోపణలు చేశారు వీహెచ్. తనకు టికెట్ దక్కకుండా బయటివారిని తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : పదవి కోసం నా కాళ్లు పట్టుకోలేదా.. ప్రమాణానికి సిద్ధమా : పెద్దిరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్
బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన కోరారు.
కాగా.. ఏపీలోనూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ సంచలన వ్యాఖ్యల చేశారు. నాడు సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారని ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మాజీ సీఎం స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తాను ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టనని, పీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి నా కాళ్లు పట్టుకుని, ఉదయం మళ్లీ వచ్చి అదే విషయంపై కాళ్లావేళ్లా పడ్డారని కిరణ్ వ్యాఖ్యానించారు.
Also Read : టార్గెట్ 400 : నరేంద్ర మోడీ ఛేదించగలరా ..?
ఈ విషయంపై తాను ప్రమాణం చేసేందుకు సిద్ధమని.. మరి పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకోలేదని ప్రమాణం చేస్తారా అంటూ కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు పెద్దిరెడ్డి కుటుంబం అన్నీ చేసిందని ఆరోపించారు. పీసీసీ పదవి విషయంలో సహకరించలేదని తనపై కక్ష పెంచుకున్నారని కిరణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేసిన అభివృద్ధి తప్పించి పీలేరులో ఆయన చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధమయ్యారని కిరణ్ ఆరోపించారు.
Comments
Post a Comment